This Weekend Releases: ఈ వారం థియేటర్/ఓటీటీ లో విడుదల కాబోతున్న 10 సినిమాల లిస్ట్..!

గత వారం థియేటర్ లో చిన్న సినిమాలు చాలా విడుదలయ్యాయి. అందులో ‘సమ్మతమే’ మాత్రమే కొద్దో గొప్పో జనాలను థియేటర్ కు రప్పించగలిగింది. మిగిలిన జనాలంతా ఓటీటీలో వచ్చిన ‘డాక్టర్ స్ట్రేంజ్’ ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రాలు చూస్తూ టైం పాస్ చేశారు. ఈ వారం కూడా 10 కి తగ్గకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈసారి థియేటర్లలో విడుదలయ్యే సినిమాల సంఖ్య తక్కువే. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒకసారి ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు :

1) పక్కా కమర్షియల్ : ‘సీటీమార్’ తో కం బ్యాక్ ఇచ్చిన గోపీచంద్… మారుతి దర్శకత్వంలో చేసిన ‘పక్కా కమర్షియల్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో కరప్టెడ్ లాయర్ గా గోపీచంద్ కనిపించబోతున్నాడు. గోపీచంద్ తండ్రి పాత్రలో సత్యరాజ్, విలన్ పాత్రలో రావు రమేష్ నటించారు.వరలక్ష్మీ శరత్ కుమార్, చిత్ర శుక్ల వంటి భామలు కూడా ముఖ్య పాత్రలు పోషించినట్లు వినికిడి. ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి మంచి హిట్ అయ్యాయి.దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఓ కమర్షియల్ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించే మూవీగా నిలుస్తుంది అని అంతా భావిస్తున్నారు.

2) ఏనుగు : మా బోయపాటిని మించిన మాస్ డైరెక్టర్ అంటే అందరికీ తమిళ దర్శకుడు హరి గుర్తుకొస్తాడు. ఆయన మొన్నటి వరకు ‘సింగం’ అంటూ సినిమాలు చేసి ఇప్పుడు ‘ఏనుగు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగులో ‘బ్రూస్ లీ’, ‘సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ట్రైలర్ బాగుంది సినిమా మంచి సక్సెస్ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హరి సినిమాలకి కూడా మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఈ సినిమా కూడా ఈ వారం ప్రేక్షకులకి ఛాయిస్ గా మారే అవకాశం ఉంది.

3) టెన్త్ క్లాస్ డైరీస్ : ‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన మూవీ ఇది. ఇందులో శ్రీరామ్, శివ బాలాజీ,హిమజ, శ్రీనివాస్ రెడ్డి, టి.ఎన్.ఆర్, నాజర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్ అంజి(గరుడ వేగ ఫేమ్) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నటుడు ‘వెన్నెల’ రామారావు పదో తరగతి బృందంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది.ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాబట్టి ఇది కూడా ప్రేక్షకులకి వీకెండ్ ఛాయిస్ గా మారే అవకాశం ఉంది.

ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు :

4) సామ్రాట్ పృథ్వీరాజ్ : అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్ జంటగా నటించిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్ అయ్యింది. అయితే అక్కడ మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసే ఛాన్స్ ఈ వారం దక్కనుంది. జూలై 1 నుండీ ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

5) ధాకడ్ : కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.ఈ మూవీ కూడా జూలై 1 నుండి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

6) అన్యాస్ ట్యుటోరియల్ : రెజీనా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అన్యాస్ టుటోరియల్’ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో జూలై 1 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది. హారర్ థ్రిల్లర్ సిరీస్ కాబట్టి దీని పై కూడా మంచి బజ్ ఏర్పడింది.

7) బాల భారతం : ఈ యానిమేషన్ సిరీస్ జూలై 1 నుండి ‘ఆహా’ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది.

8) ఆపరేషన్ రోమియో : ఈ హిందీ మూవీ జూలై 3 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

9) డియర్ విక్రమ్ : ఈ కన్నడ సినిమా జూన్ 30 నుండి వూట్ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది.

10) ది టెర్మినల్ లిస్ట్ : ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 1 నుండీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus