ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిన్న సినిమాలు ఇవే..

ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం లెక్కలు మారిపోతుంటాయి.. సంక్రాంతి సీజన్‌లో దాదాపు నాలుగు వారాల పాటు పెద్ద సినిమాల హవా నడిచింది.. ఫిబ్రవరిలో కొన్ని మీడియం, లో బడ్జెట్ సినిమాలొచ్చాయి.. గతవారం ధనుష్ ‘సార్’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’, సంతోష్ శోభన్ ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఈ వారం మరికొన్ని చిన్న చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి..

పరీక్షల సీజన్ స్టార్ట్ కావడంతో ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ధైర్యం చేయరు.. సో, స్మాల్ మూవీస్‌కి ఇదే సరైన టైం.. మరి ఈ వీక్ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలేంటో చూద్దాం..

మిస్టర్ కింగ్..

సీనియర్ నటి, లెజెండరీ డైరెక్టర్ విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ కింగ్’.. ఊర్వి సింగ్, యశ్విక నిష్కల హీరోయిన్స్.. శశిధర్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతోంది..

డెడ్ లైన్..

‘పుష్ప’, ‘వీర సింహా రెడ్డి’ వంటి పలు చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో.. బొమ్మారెడ్డి. వి.ఆర్.ఆర్. దర్శకత్వంలో రూపొందిన ‘డెడ్ లైన్’ ఈ శుక్రవారం (ఫిబ్రవరి 24)న విడుదల కానుంది.. ‘జబర్దస్త్’ కమెడియన్స్‌తో పాటు కొత్తవారు నటించిన ఈ చిత్రాన్ని తాండ్ర గోపాల్ నిర్మించారు.. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల ఆధారంగా.. యువత అభిరుచులకు పెద్ద పీట వేస్తూ ఈ మూవీని తెరకెక్కించారు..

కోనసీమ థగ్స్..

ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా గోపాల్ దర్శకురాలిగా మారి.. ‘కోనసీమ థగ్స్’ అనే మూవీ చేశారు.. ప్రముఖ నిర్మాత శిబు తమీన్స్ తనయుడు హ్రిదు హరూన్ కథానాయకుడిగా ఇంట్రడ్యూస్ అవుతుండగా.. రియా శిబు నిర్మించిన ఈ ఫిలిం ఫిబ్రవరి 24న థియేటర్లలోకి రానుంది.. తెలుగులో మైత్రీ మూవీస్ వారి మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ విడుదల చేస్తోంది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus