వీకెండ్ వచ్చేసింది.. బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేదిస్టార్ట్ అవుతుంది. మనందరికీ తెలిసిందే. అసలు ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఆసక్తికరం. వివిధ వెబ్ సైట్స్ లో ఓటింగ్ అనేది ఎలా జరిగిందనేది ఒక్కసారి చూసినట్లయితే, అరియానా టాప్ 1లో ఉంది. అరియానాకి 29శాతం వరకూ ఓటింగ్ జరిగింది. ఫస్ట్ వీక్ లోనే అరియానాకి ఈ రేంజ్ లో వచ్చింది అంటే టాస్క్ లు ఆడి గేమ్ లో సీరియస్ అయితే మాత్రం ఖచ్చితంగా ముందుకు రాకెట్ లాగా దూసుకుపోతుంది.
ఇక నెక్ట్స్ సెకండ్ ప్లేస్లో ఆర్జే చైతూ ఉన్నాడు. 14 పర్సెంట్ ఓటింగ్ ని ప్రభావితం చేశాడు. సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. థర్డ్ పొజీషన్ లో ఆల్ మోస్ట్ ఇంతే పర్సెంట్ అంటే 13 పర్సెంట్ వరకూ కూడా నటరాజ్ మాస్టర్ ప్రభావితం చేశారు. సేఫ్ జోన్ లో ఉన్నారు నటరాజ్ మాస్టర్. ఇక హమీదా కూడా నటరాజ్ మాస్టర్ కి ఈక్వల్ గా ఓటింగ్ ని ప్రభావితం చేసింది సేఫ్ జోన్ లో ఉంది. కొద్దిగా అటు ఇటుగా నటరాజ్ మాస్టర్ కి దగ్గర్లో ఉంది.
4వ పొజీషన్ లో సేఫ్ జోన్ లో ఉంది. ఇక నెక్ట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు ముగ్గురు. అందులో ముమైత్ ఖాన్, మిత్రాశర్మ, ఇంకా సరయు వీళ్ల ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది ఉండబోతోంది. దాదాపుగా ఈక్వల్ గా ముగ్గురు ఉన్నారు. ముగ్గురూ కూడా 10శాతం పైనే ఓటింగ్ ని ప్రభావితం చేశారు. ఇక్కడ వీళ్లలో ఎవరు వెళ్లిపోతారు అనేది చెప్పడం చాలా కష్టం. ముగ్గురులో పోల్చుకుంటే కొద్దిగా ముమైత్ ఖాన్ టాప్ లో ఉంది సేఫ్ గా ఉంది.
సరయు ఇంకా మిత్రా ఇద్దరే వెనకబడి ఉన్నారు. లాస్ట్ డేలో కొద్దిగా అటు ఇటుగా ఓటింగ్ అనేది జరిగింది. కొన్ని సైట్స్ లో చూసినట్లయితే సరయు లీస్ట్ లో ఉంది. మిత్రా కొన్నింటిలో లీస్ట్ లో ఉంది. అయితే, ఓవర్ ఆల్ గా చూసినట్లయితే 0.3 పర్సెంటేజ్ ఓటిగ్ తేడాతో మిత్రాశర్మ లీస్ట్ లో ఉంది. సో ఈవారం మిత్రాశర్మ వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. మిత్రాశర్మ ఫస్ట్ వీక్ ఎలిమినటే్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి అఫీషియల్ ఓటింగ్ లో ఏం జరుగుతుంది అనేది మనం ఆదివారం ఎపిసోడ్ లో చూడాల్సిందే.