బిగ్ బాస్ ఓటీటీ క్లైమాక్స్ దశకి చేరుకుంది. ఈ రియాలిటీ షోలో ఇప్పుడు 10వ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే డేంజర్ జోన్ లో ముగ్గురు కనిపిస్తున్నారు. అరియానా, అనిల్ రాధోడ్ ఇంకా అషూరెడ్డిలు ఉన్నారు. నిజానికి అరియానాకి ఈవారం టాస్క్ లో పెర్ఫామన్స్ చూపించే స్కోప్ కనిపించలేదు.అలాగే అనిల్ కి ఛాన్స్ వచ్చినా కూడా లక్ కలిసి రాలేదు. అషూరెడ్డి ఫిజికల్ టాస్క్ ఎప్పుడూ ఆడింది లేదు. లాస్ట్ టైమ్ నామినేషన్స్ లో లేదు కాబట్టి బ్రతికిపోయింది.
లేదంటే ఎలిమినేట్ అయ్యేదే అని చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఇక ఈవారం అషూరెడ్డి ఖచ్చితంగా వెళ్లిపోతుందని బిగ్ బాస్ ఆడియన్స్ నమ్ముతున్నారు. ఈనేపథ్యంలో అసలు ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. లాస్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా హమీదా ఎలిమినేట్ అయ్యింది. కానీ, ఈసారి మాత్రం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సిందే. లేదంటే హౌస్ లో లెక్కలు మారిపోతాయి.
ఉన్నది రెండు వారాలు మాత్రమే కనీసం టాప్ – 5 పార్టిసిపెంట్స్ ని ఫినాలే వరకూ ఉంచాలంటే నలుగురుని ఎలిమినేట్ చేయాలి. అంటే, ఈవారం , వచ్చే వారం కూడా ఇద్దర్ని ఎలిమినేట్ చేయాలి. లేదా బిగ్ బాస్ షోని ఇంకో వారం రోజులు పొడిగించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు కాబట్టి, ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ , లేదా డబుల్ ఎలిమినేషన్ చేయాల్సిందే. మరి ఈవారం అలా చేస్తే ఎవరు వెళ్లిపోబోతున్నారు అనేది చూడాలి.
ప్రస్తుతం అనిల్ రాథోడ్, అరియానా, అషూరెడ్డిలు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురులో నుంచే ఇద్దరు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేద్దామని అనుకుంటే అనిల్, అషూరెడ్డి ఇద్దర్నీ ఎలిమినేట్ చేస్తారు. లేదా సింగిల్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం అషూరెడ్డి వెళ్లిపోతుంది. అలా కాకుండా ఫిమేల్ కంటెస్టేంట్స్ ఇద్దర్ని పంపిద్దాం అనుకుంటే, అరియానా ఇంకా అషూ ఇద్దరూ వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ మాత్రం రసవత్తరంగానే సాగుతోంది.
ఇప్పటి వరకూ పార్టిసిపెంట్స్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తమ బెస్ట్ పెర్ఫామన్స్ ని ఇచ్చారు. ముఖ్యంగా అనిల్, యాంకర్ శివ, బిందుమాధవి, నటరాజ్ మాస్టర్ గేమ్ లో తమ కంటూ ఒక ప్రత్యేకమైన వేశారనే చెప్పాలి. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.