Bigg Boss: ఎలిమినేషన్ టెన్షన్ లో బిగ్ బాస్ ఫ్యాన్స్..! వీకండ్ జరగబోయేది ఇదేనా ?

బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆరు వారాల పాటు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ రియాలిటీ షోలో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఊహించలేకపోతున్నారు. లాస్ట్ టైమ్ తేజస్వి ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ కి షాక్ ఇస్తే, గతవారం డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్ ని షేక్ చేసింది. అయితే, ముందుగానే హౌస్ మేట్స్ ఈ డబుల్ ఎలిమినేషన్ ని అంచనా వేయగలిగారు. కానీ, తేజస్వి ఎలిమినేషన్ ని మాత్రం అంచనా వేయలేకపోయారు.

Click Here To Watch NOW

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డేంజర్ జోన్ లో ముగ్గురు కనిపిస్తున్నారు. అనిల్ రాధోడ్, అరియానా గ్లోరీ, ఇంకా నటరాజ్ మాస్టర్. ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. మహేష్ విట్టా, ఇంకా మిత్రా శర్మా ఇద్దరూ సేఫ్ జోన్ లో ఉన్నా కూడా అతి తక్కువ ఓట్లతోనే ఉన్నారు. ఏ క్షణమైనా ఈ ఇద్దరూ డేంజర్ జోన్ కి వచ్చే అవకాశం ఉంది.

ఇక ఎలిమినేషన్ లో బిగ్ బాస్ వీకెండ్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత రెండు వారాలుగా బిగ్ బాస్ లవర్స్ కి మంచి ట్విస్ట్ ఉండే స్టఫ్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈసారి కూడా ఇదే ఊపులో ఇస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ లో ఉండే సేఫ్ అనుకున్న వాళ్లని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఇంది. ప్రస్తుతానికి మిత్రాశర్మా, మహేష్ విట్టా సేఫ్ లో ఉన్నా వారిద్దరిలో కూడా ఒకర్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం బిగ్ బాస్ షోకి పెద్ద దెబ్బే తగులుతుంది.

ఇప్పుడిప్పడే షోపైనా ఆసక్తిని పెంచుకుంటున్నారు ఆడియన్స్. ఇప్పుడు , అర్ధంతరంగా షాకింగ్ ఇవ్వాలనుకుని చేస్తే మాత్రం రేటింగ్ కష్టమే అవుతుంది. మరోవైపు అరియానా ఎలిమినేట్ అవుతుందా లేదా నటరాజ్ మాస్టర్ అవ్వబోతున్నారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగానే మారింది. తేజస్వి కంటే కూడా వీక్ కంటెస్టంట్స్ ఉన్నా కూడా ఈసారి తేజస్వి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. అలాగే, ముమైత్ ఖాన్ ఆడియన్స్ తో సంబంధం లేకుండా రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈరెండు బిగ్ బాస్ షో అన్ ఫెయిర్ గా నిర్వహించారు అనడానికి సాక్ష్యాలుగా మారాయి. ఇటువంటి టైమ్ లో రిస్క్ తీసుకోకుండా బోటమ్ ఆఫ్ ద టేబుల్ లో అన్ అఫీషియల్ పోల్స్ లో ఉన్నట్లుగానే నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ అనేది జరిగితే బానే ఉంటుంది. కానీ, మాస్టర్ కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అయితే మాత్రం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాస్టర్ , ఇంకా అరియానా మద్యలోనే గట్టి పోటీ అనేది ఏర్పడింది. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus