Tholi Prema : పవన్ తొలిప్రేమ రీ రిలీజ్ లో కూడా సంచలనాలు సృష్టించిందిగా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ నటించిన తొలిప్రేమ సినిమా రీరిలీజ్ కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. 25 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయిన ఈ సినిమాను పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో ఉన్నాయని సమాచారం అందుతోంది. తొలిప్రేమ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్లు కోటీ 23 లక్షల రూపాయలు అని బోగట్టా.

పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే (Tholi Prema) తొలిప్రేమ ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోగా ప్రమోషన్స్ మరింత ఎక్కువగా చేసి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో టికెట్లు తెగాయని బోగట్టా. కరుణాకరణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తొలిప్రేమ సినిమా క్లాసిక్ గా నిలిచింది. తొలిప్రేమ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రతో బిజీగా ఉన్నారు. బ్రో మూవీ టీజర్ కు ఇప్పటివరకు ఇప్పటివరకు 32 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బ్రో మూవీ టీజర్ లో సినిమా కథకు సంబంధించి ఎలాంటి విషయాలను రివీల్ చేయలేదు. బ్రో మూవీ కమర్షియల్ గా కూడా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉండనుందని ఉండనుందని బోగట్టా.

ఈ సినిమా సముద్రఖని రేంజ్ ను మరింత పెంచడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో పవన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని సమాచారం. దాదాపుగా 25 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus