కరోనా పుణ్యమా అని కొత్త సినిమాలు విడుదలవ్వడం లేదు, ఉన్న సినిమాలు షూటింగులు జరగడం లేదు. ఈ కారణంగా ఇండస్ట్రీ మరియు ఇండస్ట్రీని నమ్ముకున్న జనాలు బాగా ఇబ్బందిపడుతుండగా.. కొందరు మాత్రం ఈ పరిస్థితిలో కూడా లాభాల బాట పడుతున్నారు. లాభం అని గట్టిగా చెప్పలేం కానీ.. కనీసం నష్టం నుండి తప్పించుకొంటున్నారని మాత్రం చెప్పొచ్చు. జనాలు బయటకి వెళ్లడానికి వీలు లేకపోవడంతో OTT ప్లాట్ ఫార్మ్స్ మీద గట్టిగా డీపెండ్ అవ్వడం మొదలెట్టారు. వారం రోజులకే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో కంటెంట్ ను ఫినిష్ చేసేసిన జనాలు.. కొత్త ప్లాట్ ఫార్మ్స్ కోసం వెతకడం మొదలెట్టారు.
ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న ఒటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ.. విడుదలకు నోచుకోలేక ఆగిపోయిన సినిమాలు, ల్యాబ్ లలో మగ్గుతున్న సినిమాలను బయటకు తీయాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పటికప్పుడు కొత్త కాన్సెప్టులతో షూటింగ్ చేయడం వీలవ్వదు కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా ఇది మంచి పద్ధతే. సొ కరోనా కారణంగా చాలా మంది బాధపడుతున్నా.. ఇలా విడుదలవ్వని చిత్రాల దర్శకనిర్మాతలు మాత్రం ఆనందపడుతున్నారు. ఈ డీలింగుల వల్ల లాభాలు రాకపోయినా నష్టపోకుండా మాత్రం ఉంటారు. మరి ఈ ట్రెండ్ కారణంగా ఎన్ని మరుగునపడిన సినిమాలు విడుదలవుతాయో చూడాలి. సొ, ఇకపై జనాలు వెబ్ సిరీస్ లు మాత్రమే కాక ఇలా పాత సినిమాలు చూసి కూడా చిల్ అవుతారన్నమాట.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్