2024 సంక్రాంతి బరిలో అరడజనుకు పైగా సినిమాలు రంగంలోకి దిగబోతున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటనలు వచ్చాయి. అవే మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైందవ్’ , రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామి రంగ’.. అలాగే తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’..! ఈ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు ఆ సినిమాల మేకర్స్ ప్రకటించారు. దీంతో 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ హీటెక్కడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే..
అన్ని సినిమాలు రావడం అసాధ్యమనే టాక్ ఇండస్ట్రీ వర్గాల నుండి ఎక్కువగా వినిపిస్తుంది.మరీ ముఖ్యంగా రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నుండి తప్పుకునే అవకాశం ఉన్నట్లుగా టాక్ మొదలైంది. అవే రవితేజ నటించిన (Eagle) ‘ఈగల్’, నాగార్జున నటించిన ‘నా సామి రంగ’. ఈ రెండు సినిమాలకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. అయితే వీటికి బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదట.
మరీ ముఖ్యంగా వీటికి ఓటీటీ డీల్స్ క్లోజ్ అవ్వలేదు అని తెలుస్తుంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ హీరోల గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద కానీ ఓటీటీలో కానీ బాగా పెర్ఫార్మ్ చేయలేదు. అందుకే వీటికి ఓటీటీ డీల్స్ ఫైనల్ అవ్వలేదు అని తెలుస్తుంది. పైగా పోటీగా చాలా సినిమాలు ఉన్నాయి. మిడ్ రేంజ్ సినిమాలకి నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ బాగా జరిగితేనే థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాతలకి ధైర్యం వస్తుంది. అయితే చూడాలి మరి.. ఇందులో ఎంతవరకు నిజముందో..!