Virata Parvam: హైదరాబాద్ వేదికగా రేపే విరాటపర్వం ప్రీ రిలీజ్..!

రానా దగ్గుబాటి సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇకపోతే ఈ సినిమాని జూన్ 17వ తేదీ విడుదల చేయడానికి పెద్ద ఎత్తున చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.

ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం కోసం మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆత్మీయ వేడుక అంటూ పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహించిన చిత్ర బృందం మరోసారి ఫ్రీ రిలీజ్ వేడుక ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కావడంతో జూన్ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఫ్రీ రిలీజ్ వేడుక అంటే తప్పనిసరిగా స్టార్ సెలబ్రెటీలు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. మరి విరాట పర్వం సినిమాకి కూడా ముగ్గురు స్టార్ సెలబ్రెటీలు ముఖ్య అతిథులుగా రానున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

మరి వారు ఎవరు అనే విషయానికి వస్తే దగ్గుబాటి హీరో వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ ముగ్గురు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారు. విరాటపర్వం సినిమాని 1990లో తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో రానా రవన్న పాత్రలో సందడి చేయగా, సాయి పల్లవి వెన్నెల పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇక ఈ సినిమాని తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో నవీన్ చంద్రతో పాటు సీనియర్ నటి ప్రియమణి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు ఊడుగుల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus