Rajinikanth: కొత్త సినిమా హీరోయిన్లు ప్రకటించిన టీమ్‌… రజనీ సరసన మెరిసేది ఎవరంటే?

రజనీకాంత్‌ మేనియా అంటే గతం అనుకునేవారు ఈ మధ్య వరకు. తలైవా వరుస సినిమాలు చేస్తున్నా సరైన విజయం దక్కకపోతుండటంతో ఫ్యాన్స్‌ కూడా ఢీలా పడిపోయారు. అయితే ఒక్క దెబ్బకి మొత్తం మత్తు వదిలేసేంత వసూళ్లు, రికార్డులు అందించింది ‘జైలర్‌’ సినిమా. ఇది కూడా సగటు సినిమానే అని కొంతమంది నిట్టూరుస్తున్న సమయంలో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ‘ఎంత మాత్రం కాదు’ అంటూ సినిమాలో కొత్తదనం గురించి చెప్పకనే చెప్పారు. వచ్చాక వసూళ్లు లెక్క రూ. 600 కోట్లు దాటేసింది.

అయితే ఆ సినిమా ఇచ్చిన కిక్కో, లేకపోతే ఇంకేమైనానో కానీ రజనీకాంత్‌ తన తర్వాతి సినిమాను మరింత బిగ్గర్‌గా చూపించాలని ఫిక్స్‌ అయ్యారు. సూర్య ‘జై భీమ్’ ఫేమ్ టీజీ జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొత్త చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్‌ సినిమాలో నటిస్తున్నవాళ్ల పేర్లను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలోని హీరోయిన్ల పేర్లను ఇటీవల వెల్లడించారు. దాని ప్రకారం చూస్తే ఆ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉన్నారు.

(Rajinikanth) రజనీకాంత్‌ 170వ సినిమాగా తెరకెక్కుతున్న ఆ చిత్రంలో మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టి మంజు వారియ‌ర్ ఓ కథానాయిక కాగా, ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ మరో నాయిక. ఇక దుషారా విజ‌యన్ మూడో నాయికగా తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురిలో మంజు మాత్ర‌మే ర‌జినీకి జోడీగా నటిస్తోంది అంటున్నారు. మిగతిలిన ఇద్దరు రితికా, దుషారా కీలక పాత్రలు పోషిస్తారని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయి నటులు ఉన్నారు.

ఇంకా కొన్ని రివీలీషన్స్‌ ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి పేరును సినిమాలో ఓ ముఖ్యపాత్రధారిగా ప్రకటించగా… మరో ముఖ్య పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తారని టీమ్‌ వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ అయిపోయారు. ఇక మలయాళం, కన్నడ నుండి నటులను ఎంపిక చేస్తారని టాక్‌.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus