సగం ఆగస్టు అయిపోయింది.. వచ్చే నెలకేనా?

హీరోలు ముఖ్యంగా స్టార్‌ హీరోలు వరుసగా సినిమాలు మొదలుపెట్టాలి. వెంట వెంటనే సినిమాలు చేసి థియేటర్లలోకి వదలాలి. ప్రేక్షకులు ఆ సినిమాలు చూసి ఎంజాయ్‌ చేయాలి. ఇదీ సినిమా ఇండస్ట్రీ కోరుకునే ప్రాసెస్‌. కానీ టాలీవుడ్‌లో ముగ్గురు స్టార్‌ హీరోలు, ముగ్గురు స్టార్‌ దర్శకులు ఈ కాన్సెప్ట్‌ కిందకి రావడం లేదు. కారణాలు తెలియవు కానీ.. కొత్త సినిమా స్టార్ట్‌ చేయకుండా ప్రేక్షకులకు, అభిమానులకు ఎదురుచూపులు మిగులుస్తున్నారు. దీంతో ‘మాకేంటిది’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో చిరాకు పడుతున్నారు.

టాలీవుడ్‌లో సినిమాలు సెట్స్‌ మీద లేకుండా ఉన్న స్టార్‌ హీరోలు అంటే.. అల్లు అర్జున్‌, తారక్‌, మహేష్‌బాబు మాత్రమే కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్లు ఏదో ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ ఈపాటికే మొదలై ఒకట్రెండు షెడ్యూల్స్‌ కూడా అయిపోవాలి. ఇక తారక్‌ సినిమా సంగతి అయితే డైలాగ్‌ రిలీజ్‌ అయ్యి అక్కడే ఉండిపోయింది. మహేష్‌బాబు సినిమా అయితే కొబ్బరికాయ కొట్టుకుని అక్కడే కొట్టుమిట్టాడుతోంది. ‘పుష్ప 2’ చేయాల్సిన సుకుమార్‌ ఇంకా తన టీమ్‌తో డిస్కషన్‌లో ఉన్నారని టాక్‌.

‘ఆచార్య’ ఎఫెక్ట్‌తో కొరటాల శివ ఇంకా తారక్‌ సినిమా కథకు రిపేర్లు చేస్తున్నారని సమాచారం. త్రివిక్రమ్‌ అయితే ఇటీవల కథను ఓకే చేసుకున్నారు. అయితే కాస్టింగ్‌ విషయంలో ఇంకా విషయం కొలిక్కి రాలేదంటున్నారు. ఈ లెక్కన ఈ మూడు సినిమాలు జూన్‌ నుండి జులైకి, అక్కడి నుండి ఆగస్టుకి వచ్చాయి. ఈ నెల షూటింగ్‌లు బంద్‌ కాబట్టి మొదలు కాలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికీ పనులు పూర్తి కాలేదట.

మరి సెప్టెంబరులో అయినా షూటింగ్‌లు మొదలవుతాయా అంటే.. దీనికీ సరైన సమాధానం రావడం లేదు. దీంతో బన్నీ, మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఎన్ని రోజుల వరకు ఉంటుందో అర్థం కావడం లేదు. సినిమా అనేది స్టార్ట్‌ అయితే ఏదో ఒకటి చెప్పుకోవడానికి. ఈ మూడు కాంబోలకు ఈ సినిమాలు స్పెషలే. ‘పుష్ప’ క్రియేట్‌ చేసిన రికార్డుల తర్వాత ‘పుష్ప 2’ వస్తోంది. హ్యాట్రిక్‌ కోసం కొరటాల – తారక్‌ రెడీ అవుతున్నారు. 11 ఏళ్ల తర్వాత మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా చేస్తున్నారు. సో.. ఉలుకోపలుకో ఉంటే బాగుంటుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus