డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

ఆగస్టు 14న తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా కీలకమైన రోజు. ఎందుకంటే ఆ రోజున 2 పెద్ద డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ‘2 పెద్ద డబ్బింగ్ సినిమాలు’ ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అవి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి ‘వార్ 2’. ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది. ‘బ్రహ్మాస్త్రం’ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఇక మరొకటి ‘కూలి’ రజినీకాంత్ -నాగార్జున కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది. ‘విక్రమ్’ ‘ఖైదీ’ వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు.

Coolie & War 2

అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటికి డిమాండ్ ఎక్కువయ్యింది. ఫస్ట్ వీకెండ్ లో ఈ 2 సినిమాలు మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. వీకెండ్ తర్వాత టాక్ బాగున్న సినిమా నిలబడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇవి ‘పెద్ద డబ్బింగ్ సినిమాలు’. అయినప్పటికీ వీటికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలకు రిక్వెస్ట్..లు పెట్టుకుంటున్నారు అంటే నమ్ముతారా? వినడానికి కష్టంగా ఉన్నా.. ఇది నిజం. ఈ సినిమాలపై ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు రూ.50(సింగిల్ స్క్రీన్స్), రూ.75(మల్టీప్లెక్సులు) వరకు పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. ‘కూలీ’ ని తెలుగు రాష్ట్రాల్లో ‘ఏషియన్ సినిమాస్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్'(దిల్ రాజు) సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ‘వార్ 2’ ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్'(నాగవంశీ) రిలీజ్ చేస్తున్నాయి. ‘కూలీ’ కి రూ.45 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ‘వార్ 2’ కి రూ.80 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో మొదటి వీకెండ్లోనే మ్యాగ్జిమమ్ రికవరీ చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ భావిస్తున్నట్టు సమాచారం. బిజినెస్ పరంగా టికెట్ రేట్ల పెంపు అనే విషయంలో తప్పు లేకపోయినా.. జనాలు దీనిని ఎలా తీసుకుంటారు అనేది పెద్ద ప్రశ్న.

ఈ 3 రోజులు చాలా కీలకం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus