టికెట్ రేట్లు తగ్గించడం అనేది ఒక్క వై.ఎస్.జగన్ మాత్రమే చేయలేదు. గతంలో మరో ఇద్దరు సీఎం లు కూడా చేశారు. వాళ్ళలో ఒకరు పెద్ద ఎన్టీఆర్ కాగా, మరొకరు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. వివరాల్లోకి వెళితే.. ఒకప్పటి రోజుల్లో అంటే సినిమా టికెట్ పది పైసలు, ఇరవై పైసలు ఉండే రోజుల్లో.. ఒక టికెట్ పై నలుగురు, ఐదుగురిని థియేటర్ లోపలికి పంపేవారు. అలా అని మిగిలిన వాళ్ళని డబ్బులు ఇవ్వకుండా కాదు. హాలు నిండా జనాలు ఉన్నా..
అమ్మిన టికెట్ లకి మాత్రమే ట్యాక్స్ లు కట్టేవారు థియేటర్ ఓనర్లు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్లాబ్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. దాంతో పాటు టికెట్ రేట్లు కూడా తగ్గించారు. ఈ విషయమై ఒకసారి దాసరి గారు వెళ్ళి ‘అయ్యా.. టికెట్ రేట్లు తగ్గించడం పట్ల ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబ్యూటర్లు గోల పెట్టేస్తున్నారు. దీనికి ఏదైనా పరిష్కారాన్ని చూడండి’ అంటూ ఎన్టీఆర్ ను రిక్వెస్ట్ చేశారు. అందుకు ఎన్టీఆర్ గారు.. ‘ నాకు కూడా 6 థియేటర్లు ఉన్నాయి.
నిజంగా వారికి ఏమైనా బాధలు ఉంటే… అది నాకు కూడా తెలుస్తుంది. ఏ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ కు ఇబ్బంది కలిగిందో వారిని నా వద్దకు తీసుకురండి. టికెట్ రేట్లు తగ్గించే ప్రసక్తి అయితే లేదు’ అంటూ బదులిచ్చారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు హయాంలో కూడా అదే పద్ధతి కొనసాగింది.అయితే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్లాబ్ సిస్టంని తీసేసారు.మళ్ళీ ఇన్నాళ్టికి ప్రభుత్వం మళ్ళీ టికెట్ రేట్ల విషయంలో జోక్యం చేసుకుని పెద్ద రచ్చ చేయడం చూసాము.
నిజానికి టికెట్ రేట్లు పెంచుకునే ముందు ప్రభుత్వానికి వినతి పత్రం రాయాలనే రూల్ మాత్రమే ఉంది. కానీ అప్పటివరకు ఉన్న టికెట్ రేట్లని తగ్గించే విధంగా అయితే ఆ చట్టం లేదని హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ల టికెట్ రేట్లను డిసైడ్ చేసే హక్కు అయితే ప్రభుత్వానికి ఉండదని కూడా స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!