రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఫస్ట్ వీకెండ్ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కు టికెట్లు దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. టికెట్ రేట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ మూవీకి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాకు ఎంత మొత్తమైనా ఖర్చు చేసే విషయంలో ఫ్యాన్స్ వెనక్కు తగ్గడం లేదు. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా కలెక్షన్లకు ఢోకా లేదని తెలుస్తోంది.
Click Here To Watch NEW Trailer
అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత మాత్రం ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీకి టికెట్ రేట్లు మరీ దారుణంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ మేకర్స్ అత్యాశకు పోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయానికి హిందీ, తమిళం, మలయాళ భాషల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో జరుగుతున్నాయి.
అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు తగ్గకపోతే మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇబ్బందులు తప్పవు. దేశంలో ఎక్కువమంది సినిమాను కుటుంబంతో కలిసి చూడటానికి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఖర్చు చేసే స్థితిలో లేరు. వీకెండ్ తర్వాత ఆర్ఆర్ఆర్ కు సాధారణ టికెట్ రేట్లు పెడితే మాత్రం సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. మరి ఆర్ఆర్ఆర్ మేకర్స్ మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా కనీసం 250 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!