Tiger Nageswara Rao: ఆ భాషలో రిలీజ్ అయిన తొలి సినిమా రవితేజదే..!

  • May 24, 2024 / 06:33 PM IST

గత ఏడాది రవితేజ (Ravi Teja) నుండి ‘రావణాసుర’ (Ravanasura) ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘టైగర్ నాగేశ్వరరావు’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా పై రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ‘స్టూవర్టుపురం గజదొంగ’ నాగేశ్వరరావు జీవితాన్ని xఆధారం చేసుకుని ఈ సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు వంశీ (Vamsee Krishna Naidu) . కానీ కథలో ఎక్కడా ఒరిజినాలిటీ కనిపించలేదు. సరైన ఎమోషన్స్ లేవు. నాగేశ్వరరావుని స్త్రీలోలుడుగా చూపించడం.. అతన్ని మొదట రాక్షసుడిగా ప్రొజెక్ట్ చేయడం వంటివి ఆడియన్స్ కి రుచించలేదు.

అందుకే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలాంటి సినిమా గురించి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా. ‘టైగర్ నాగేశ్వరరావు’ ని ఇప్పుడు మరో భాషలో విడుదల చేశారట. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ సైన్ లాంగ్వేజ్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిందట. వినికిడి సమస్య ఉన్నారు, అందులోనూ చదువురాని వారికి ఈ సైన్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది.

ఈ భాషలో ఇప్పటివరకు ‘టైగర్ నాగేశ్వరరావు’ తప్ప మరే తెలుగు సినిమా అందుబాటులోకి రాలేదు. అందుకే ఈ డిజాస్టర్ సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. నుపుర్ సనన్ (Nupur Sanon) , గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) …లు హీరోయిన్లుగా నటించిన ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో మాజీ హీరోయిన్ రేణుదేశాయ్ (Renu Desai) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus