రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం దసరా కానుకగా గత నెల అంటే అక్టోబర్ 20 న రిలీజ్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్లాప్ గా మిగిలింది. గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ మూవీ రూపొందింది. బయోపిక్ అయినప్పటికీ కమర్షియల్ సినిమాగానే తీశారు. అయినా టికెట్లు తెగలేదు. కొంత భాగం ట్రిమ్ చేసినా ఉపయోగం లేకపోయింది.
అయితే రవితేజ మాత్రం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అది ప్రతి ఫ్రేమ్లోనూ తెలుస్తుంది .ఇక థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నవంబర్ 17(ఈ రోజు) నుండి ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. పెద్దగా హడావిడి లేకుండా చాలా సైలెంట్ గా ఈ మూవీ (Tiger Nageswara Rao) ఓటీటీకి వచ్చేసింది అని చెప్పాలి.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. హిందీలో మాత్రం స్ట్రీమింగ్ డిలే అవుతుంది.అది టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే అని తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!