రవితేజ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రవితేజ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ధమాకా, వాల్తేరు వీరయ్య సక్సెస్ లతో రవితేజ జోరుమీదున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని రవితేజ కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వంశీకృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా దీపావళి లేదా క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.
రవితేజ ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోకపోతే రవితేజ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తం వెనక్కు ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. రవితేజతో కలిసి సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ వయస్సుకు తగిన కథలను ఎంచుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
రవితేజ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రవితేజ కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మరిన్ని సక్సెస్ లను అందుకుంటారని చెప్పవచ్చు. యంగ్ డైరెక్టర్లు, టాలెంటెడ్ డైరెక్టర్లతో పాటు ఫ్లాప్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇస్తూ రవితేజ సత్తా చాటుతున్నారు.