Ram Charan: మరో టాలీ-బాలీ పవర్‌ఫుల్‌ కాంబో సిద్ధం… ఈసారి కుర్ర హీరోనే?

రామ్‌ చరణ్‌ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే అధికారికంగా వెల్లడైన ఈ సినిమా గురించి తర్వాత వస్తున్న పుకార్లు, వార్తలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం బుచ్చిబాబు చేస్తున్న గ్రౌండ్‌ వర్క్‌ అలా ఉంది. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లోనే సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో హైలైట్‌ చేస్తున్నారు. సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా అలానే ఉంది అని చెబుతున్నారు.

తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ యువ హీరోను కలిశారు అనేది టాక్‌. రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది అని చెబుతున్న చరణ్‌ కొత్త సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడని గత రెండు రోజులుగా టాలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్రకు టైగర్ ష్రాఫ్ అయితే సరిపోతాడు అని టీమ్‌ ఫిక్స్‌ అయ్యారట.

ఈ మేరకు టైగర్‌ను కలిసే అవకాశం ఉందంటున్నారు. ప్రాథమిక చర్చలు పూర్తయ్యాక, పూర్తి స్థాయిలో కథ చెప్పి ఓకే చేయించుకోవాలని బుచ్చిబాబు అనుకుంటున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది అంటున్నారు. ఈ సినిమాను నవంబరులో ప్రారంభిస్తారనే టాక్‌ వచ్చింది. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌కి ఈ సినిమాకు సంబంధం ఉండదని, కాబట్టి ఆ సినిమా పనులు అయ్యాకనే ఈ సినిమా ఉండొచ్చు అంటున్నారు. ఏడాది ఆఖరులో దీనిపై క్లారిటీ వస్తుంది.

ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహ్మాన్‌ను తీసుకున్నారు. ఈ మేరకు ఆయన కూడా అధికారికంగా ప్రకటించారు. అలాగే మిగిలిన సాంకేతిక నిపుణుల విషయంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. అలాగే కథానాయికగా మృణాల్‌ ఠాకూర్‌ పేరు తొలుత వినిపించింది, ఆ తర్వాత జాన్వీ కపూర్‌ అన్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్‌ నాయిక పేరు చర్చల్లో వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ ఎప్పుడో చూడాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus