మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో (Sankranthiki Vasthunnam) పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు అనిల్ రావిపూడి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి.. రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో కంటెంట్ కొత్తదేమీ కాదు.
కానీ దానికి అలంకరణ మాత్రం సంక్రాంతి పండుగకి తగ్గట్టుగా చేశాడు అనిల్ రావిపూడి. అందువల్లే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈరోజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ వేడుకని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. దీనికి గెస్ట్ గా సీనియర్ స్టార్ దర్శకులు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) గారు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా హైలెట్ అయ్యింది.
ఈ సినిమా మేజర్ సక్సెస్ కి కారణం వెంకటేష్ తో (Venkatesh) పాటు సంగీత దర్శకుడు భీమ్స్ (Bheems Ceciroleo) అలాగే హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)అని చెప్పుకొచ్చారు. అలాగే బుల్లి రాజు కి కూడా ఎక్కువ మార్కులు పడతాయని తెలిపారు. అలాగే చిరంజీవితో అనిల్ చేస్తున్న సినిమాకి కూడా భీమ్స్ సంగీత దర్శకుడు అని కె.రాఘవేంద్రరావు కన్ఫర్మ్ చేశారు. ఇదే క్రమంలో ఆ సినిమాకి ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్ పెడితే బాగుంటుంది అని తన మనసులో మాటని బయటపెట్టారు కె.రాఘవేంద్రరావు.
చిరంజీవి సినిమాకి నా ఉద్దేశంలో సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలి : కె.రాఘవేంద్ర రావు#Megastar #Anilravipudi #Dilraju #RaghavendraRao pic.twitter.com/GH0CR0a7Rs
— Filmy Focus (@FilmyFocus) February 10, 2025