2023 చివర్లో వచ్చిన ‘డెవిల్’ (Devil) తర్వాత కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది 21వ సినిమాగా ప్రచారమవుతోంది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’, ‘అశోక క్రియేషన్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా వదిలారు.
ఇందులో ఆమె పోలీస్ పాత్ర పోషిస్తుంది. విజయశాంతి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ తప్ప.. ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోవడం వల్ల.. ఆగిపోయింది అని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ సినిమాకి ఏకంగా రూ.55 కోట్ల బడ్జెట్ అయ్యిందని, ఇంకా 4 షెడ్యూల్స్ ఫినిష్ కంప్లీట్ చేయాల్సి ఉంది అంటూ ప్రచారం జరిగింది.
మరోపక్క ఈ సినిమాకి ‘మెరుపు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. తర్వాత అందులో నిజం లేదు అని.. ఈ సినిమాకి ‘రుద్ర’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు కూడా టాక్ నడిచింది.అయితే అందులో కూడా నిజం లేదు అనేది తాజా సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం..
కళ్యాణ్ రామ్ సినిమాకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇందులో హీరో కళ్యాణ్ రామ్ తో పాటు లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని కూడా హైలెట్ చేసినట్లు ఉంటుంది అని మేకర్స్ ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు స్పష్టమవుతుంది.