Bellamkonda Srinivas: పారితోషికం పెంచుకుంటూ పోతున్న బెల్లంకొండ.. ఇప్పుడు ఎంతంటే?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) కెరీర్లో హిట్లు చాలా తక్కువ. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇతనికి ‘అల్లుడు శీను’ తో (Alludu Seenu) మంచి ఎంట్రీ దక్కింది. దాని వల్ల ఇతనికి మాస్ ఫాలోయింగ్ ఉంది. నితిన్ (Nithin Kumar), వరుణ్ తేజ్ (Varun Tej) వంటి హీరోల కంటే కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి.. మాస్ ఆడియన్స్ లో క్రేజ్ ఉంది అనేది వాస్తవం. ఇతని సినిమాలు ఎలా ఉన్నా.. స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్..లతో ఇతను మ్యాజిక్ చేయగలడు.

Bellamkonda Srinivas

అందుకే తెలుగులో ఇతని సినిమాలకి థియేట్రికల్ బిజినెస్, కలెక్షన్స్ వంటివి బాగుంటాయి. ‘అల్లుడు అదుర్స్’ (Alludu Adhurs) తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) నుండి మరో సినిమా రాలేదు. హిందీలో చేసిన ‘ఛత్రపతి’ కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు బెల్లంకొండ. ప్రస్తుతం అతను 4 సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలీదు.

కానీ పారితోషికం మాత్రం పెంచుకుంటూ పోతున్నాడట బెల్లంకొండ. అవును.. సాగర్ చంద్ర (Saagar K. Chandra) దర్శకత్వంలో చేస్తున్న ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) సినిమా కోసం రూ.7.5 కోట్లు పారితోషికం అందుకున్న బెల్లంకొండ.. తర్వాతి సినిమాలైన ‘భైరవం’ (Bhairavam) ‘హైందవం’ వంటి సినిమాలకి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇతని పారితోషికం కాకుండా సినిమా బడ్జెట్ రూ.25 కోట్ల వరకు అవుతుంది.

అయినా సరే నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు అని వినికిడి. ఎందుకంటే ఇతని హిందీ డబ్బింగ్,డిజిటల్, శాటిలైట్.. వంటి రైట్సే రూ.25 కోట్ల వరకు వెళ్తాయి. ఇక తెలుగు బిజినెస్ అంతా నిర్మాతలకి బోనస్. అందుకే బెల్లంకొండ ఒక్కో సినిమాకి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

మహేష్ ప్లాప్ సినిమా ఇష్టమంటున్న యంగ్ హీరో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus