Pawan Kalyan, Rana: త్రివిక్రమ్‌ మార్క్‌ ఉంది… ‘అ’క్షరం లేకుండా

‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమా రీమేక్‌ పనులు మొదలైనప్పుటి నుండి సినిమాకు టైటిల్‌ ఏం పెడతారు అనే ప్రశ్న అభిమానుల్లో ఉండిపోయింది. రకాల రకాల పేర్లు వినిపిస్తున్నా… అందులో ఏవీ సినిమా కథ, కాన్సెప్ట్‌కు తగ్గ పేర్లలా కనిపించలేదు. అయితే తొలిసారి సినిమా పాయింట్‌కు తగ్గ పేరు పుకారుగా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆ టైటిల్‌ను ప్రొడక్షన్‌ హౌస్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించదనే టాక్‌ కూడా వినిపిస్తోంది. సినిమాను అనౌన్స్‌మెంట్‌ చేసినప్పుడు చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది.

అందులో బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌లో కలిసిపోతూ ‘బిల్లా రంగా’అనే పేర్లు వినిపించాయి. దీంతో సినిమా పేరు అదే అవ్వొచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ పేరు కాదని… వేరే పేర్లు ఆలోచిస్తున్నారని వార్తలొచ్చాయి. తాజాగా ‘పరశురామ కృష్ణమూర్తి’ అనే పేరును సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ రిజిస్టర్‌ చేయించిందని టాక్‌. దీంతో పవన్‌ – రానా సినిమాకు అదే పేరు అని అనుకుంటున్నారు. ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమా కథ తెలిసినవారికి ఈ పేరు ఎలా సరిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ సినిమా కథ అంతా ‘ఈగో’ మీద నడుస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈ సినిమాకు ‘పరశురామ కృష్ణమూర్తి’ అని బాగుంటుందని త్రివిక్రమ్‌ అండ్‌ టీమ్ ఆలోచించారట. దానికి దర్శకుడు కూడా ఓకే అనుకున్నారట. అయితే త్రివిక్రమ్‌ మార్కు ‘అ’క్షరం లేకుండా… ఈ సినిమా టైటిల్‌ ఉండబోతోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus