ఎన్నో ఏళ్లు పడ్డ కష్టం.. ఒక్క సినిమా విజయం.. ఏది గొప్ప అంటే రెండూ గొప్పే అని చెబుతారు. అయితే పడ్డ కష్టానికి సరైన విజయం దక్కితే ఊహించని అవకాశాలు సంపాదించొచ్చు సినిమాల్లో. ఇప్పుడు ఇలాంటి స్టేజీలోనే ఉన్నారు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) . ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయినా.. ‘హను – మాన్’ (Hanu Man) సినిమాతో ఆయన అందుకున్న విజయం, ఇండస్ట్రీకి ఇచ్చి జెమ్ లాంటి చిత్రం ఇప్పుడు బాలీవుడ్ ఛాన్స్‌లు వచ్చేలా చేస్తోంది.
‘హను – మాన్’ సినిమా తరవాత దర్శకుడు ప్రశాంత్ వర్మ రేంజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు, నిర్మాణ సంస్థలు లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ పవర్ హౌస్‌గా పిలుచుకునే రణవీర్ సింగ్‌తో (Ranveer Singh) ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నిజమెంత అనేది ఇంకా టీమ్ నుండి ఎలాంటి సమాచారం లేకపోయినా.. ఇప్పుడు ఏకంగా సినిమా పేరు బయటకు వచ్చేసింది. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం అయితే సినిమా పేరు ఫిక్స్ చేసేశారట.
‘బ్రహ్మరాక్షస’ అనే పేరుతో రణ్‌వీర్ సింగ్ – ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుంది అనేది సోషల్ మీడియా ముచ్చట. ‘హను – మాన్’ సినిమా నుండి ప్రశాంత్ వర్మ సూపర్ హీరో కథల వైపు వచ్చేశారు. ఆ కథలతో సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ‘బ్రహ్మరాక్షస’ కూడా ఉంటుంది అని సమాచారం. కథ ఫైనల్ అయిదని, రణవీర్ కూడా ఓకే చెప్పేశాడని టాక్.
అయితే హిందీలో ‘బ్రహ్మ రాక్షస’ అనే పేరు పెడతారని ఊహించలేం. ఎందుకంటే అది తెలుగుకు దగ్గరగా ఉంది. ఏదైనా చిన్నపాటి మార్పులతో ‘బ్రహ్మ రాక్షస్’ లాంటివి ట్రై చేయొచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అదయ్యాకనే రణ్‌వీర్ సింగ్ సినిమా ఉండొచ్చు అని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయంలోనూ క్లారిటీ వస్తుంది అంటున్నారు. చూద్దాం అప్పుడు పేరు విషయంలోనూ క్లారిటీ వస్తుంది.