మూవీ థీమ్ అర్ధమయ్యేలా డిజైన్ చేసిన టైటిల్స్

సినీ ప్రేక్షకుల అభిరుచి.. ఆలోచన మారింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఫిలిం మేకర్స్ ప్రతి ఒక్కదానిలో సృజనాత్మకతను నిరూపించుకోవాల్సి వస్తోంది. అందుకే టైటిల్ నుంచి శుభం కార్డు వరకు జాగ్రత్తపడుతున్నారు. క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. టైటిల్స్ లోనే మూవీ థీమ్ అర్ధమయ్యేలా డిజైన్ చేయించి ఆకర్షిస్తున్నారు. అలా ఆకట్టుకున్న టైటిల్స్ పై ఫోకస్…

కబాలికబాలి తెలుగు టైటిల్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే “క” అక్షరంలో వర్కర్స్ కనిపిస్తారు. “బా” అక్షరంలో రజనీ, “లి” అక్షరంలో బిల్డింగ్స్ కనిపిస్తాయి. వలసవెళ్లిన రజనీకాంత్ మలేసియాలో పెద్ద డాన్ గా మారిన స్టోరీ అర్ధం వచ్చేలా డిజైన్ చేశారు.

నాన్నకు ప్రేమతోనాన్నకు ప్రేమతో సినిమాలో హీరో ఎన్టీఆర్ “అందరూ సమయాన్ని సెకండ్స్ లో కొలిస్తే, నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను” అని డైలాగ్ చెబుతారు. సో ఆ విషయాన్ని తెలిపేలా ఈ మూవీ పేరు మధ్యలో హార్ట్ రేట్ గ్రాఫ్ ఉంటుంది.

క్షణంక్షణం మూవీ టైటిల్ ఫస్ట్ లెటర్ బాటమ్ లో ఫారిన్ కంట్రీ ని చూపిస్తూ, సెకండ్ లెటర్ లో హైదరాబాద్, థర్డ్ లెటర్ లో చిన్న పాప కనిపిస్తుంది. తప్పిపోయిన పాప ని వెతకడం కోసం అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చే ఒక పర్సన్ స్టోరీ అని మూవీ టైటిల్ చెబుతుంది.

ధృవఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, ఫస్ట్ లెటర్ ని ‘8’ లా ఎందుకు డిజైన్ చేసారు? అని రకరకాలుగా అనుకున్నారు. మూవీ చూసాక అందరికి తెలిసివచ్చింది. హీరో విలన్ ని “అష్టదిగ్బంధనం’ అనే కాన్సెప్ట్ తో కొడతాడు. అందుకే మూవీ టైటిల్ లో 8 అనే సంఖ్య పెట్టారు.

సికిందర్సూర్య నటించిన సికిందర్ మూవీ టైటిల్ ని గద్ద రూపంలో డిజైన్ చేయించారు. అలాగే పేరు మధ్యలో బుల్లెట్ పెట్టి పూర్తి యాక్షన్ చిత్రమని స్పష్టం చేశారు.

ఇజంకమ్యూనిజం, హీరోఇజం , హ్యూమనిజం, సోషలిజం ఇలా ‘ఇజం’ తో ఎండ్ అయ్యే ఎన్నో వర్డ్స్ తో ఈ టైటిల్ డిజైన్ చేసారు.

శివశివ మూవీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సైకిల్ చైన్. ఒక ట్రేడ్ మార్క్ లా ఆ మూవీ కి ఉన్న ఆ ఎలిమెంట్ పోస్టర్ లో కూడా బాగా సెట్ చేసారు.

సూర్య వెర్సెస్ సూర్యఈ మూవీ లో హీరో కి ఉన్న మెడికల్ కండిషన్ వల్ల పగలు బయటికి రాలేడు. సో సన్ ని చూసి బయపడుతున్నటుగా ఆ మూవీ కాన్సెప్ట్ ని ఇన్వాల్వ్ చేస్తూ పోస్టర్ లో టైటిల్ డిజైన్ ఉంటుంది. టాప్ ‘ర్య’ లో సూర్యుడు, బాటమ్ ‘ర్య ’ లో హీరో ఉండేలా డిజైన్ చేశారు.

గడ్డం గ్యాంగ్గడ్డం గ్యాంగ్ మూవీ పేరుకి తగ్గట్టు గడ్డం లాగా ఈ పోస్టర్ డిజైన్ చేసారు.

మన్మధ బాణంమన్మధ అనే పదం ని హార్ట్ షేప్ లో, బాణం అనేది బాణం షేప్ లో డిజైన్ చేసారు.

అసురఅసుర అంటే రాక్షసుడు అని అర్ధం. అంతే భయంకరంగా డిజైన్ చేసారు.

తుపాకీఫిస్టల్ ఆకారంలో తుపాకీ టైటిల్ ని డిజైన్ చేశారు.

ఇలా కథను టైటిల్స్ లో తెలిపే అనేక డిజైన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఆకర్షించిన మూవీ టైటిల్స్ ఉంటే కామెంట్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus