తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన మాదకద్రవ్యాల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్… తాజాగా కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
డ్రగ్స్ కేసులో ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 22 వరకు విచారణకు హాజరు కావాలని పలువురు సినీ తారలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తారలు ఎప్పుడు విచారణకు హాజరు కావాలనే సమాచారం కూడా బయటకు వచ్చింది. దాని ప్రకారం తొలుత ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారించనున్నారు. ఆగస్టు 31న విచారణ రావాలని పూరికి నోటిసులు జారీ అయ్యాయని సమాచారం.
డ్రగ్స్ కేసు విషయంలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే… సెప్టెంబరు 2న ఛార్మి విచారణ హాజరు కావాల్సి ఉంటుంది. సెప్టెంబరు 6న రకుల్ ప్రీత్‌సింగ్, 8న రానా దగ్గుబాటి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారట. ఇక సెప్టెంబరు 9 రవితేజ, శ్రీనివాస్ రావాల్సి ఉంటుంది. నటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎంలు సెప్టెంబరు 13న హాజరు కావాలి. నటి ముమైత్ ఖాన్‌కు సెప్టెంబరు 15న రావాలని నోటీసులు ఇచ్చారట. తనీష్‌కు సెప్టెంబరు 17 అని చెప్పగా, నటుడు నందుకు సెప్టెంబరు 20, తరుణ్‌కు సెప్టెంబరు 22 తేదీ ఇచ్చారట. ఆ రోజు ఆయా నటులు ఈడీ ఎదుట హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారని భోగట్టా.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!