Ram Charan: వైరల్ అవుతున్న ప్రముఖ నటి ఆసక్తికర వ్యాఖ్యలు!

Ad not loaded.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్ డేట్ వస్తుందని గత నెలలోనే ప్రకటన వెలువడినా ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తైనా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆరు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. అందువల్ల గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన ఇప్పట్లో రావడం కష్టమని భోగట్టా. 2024 దసరా కానుకగా గేమ్ ఛేంజర్ విడుదలవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మంత్ ఆఫ్ మధు, దూత వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకున్న వైజాగ్ బ్యూటీ జ్ఞానేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చరణ్ గురించి చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. స్టార్ హీరో రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానమని చరణ్ పై ఉండే అభిమానం వల్ల ఒక ఫోటో బుక్ ను తయారు చేసుకున్నానని ఆ ఫోటో బుక్ ఇప్పటికీ నాతోనే ఉందని ఆమె తెలిపారు.

పదేళ్ల క్రితం (Ram Charan) రామ్ చరణ్ ను కలిసి ఉంటే పెళ్లి చేసుకోవాలని అడిగేదానినని ఇప్పుడు రామ్ చరణ్ ను కలిస్తే మాత్రం చరణ్ మూవీలో ఛాన్స్ కావాలని అడుగుతానని ఆమె పేర్కొన్నారు. జ్ఞానేశ్వరి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జ్ఞానేశ్వరి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ కావాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జ్ఞానేశ్వరి భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. జ్ఞానేశ్వరి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus