గాలి కూతురు వివాహ వేడుకకు హాజరుకాని టాలీవుడ్ స్టార్స్
- November 21, 2016 / 07:27 AM ISTByFilmy Focus
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మణి వివాహా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని మెయిన్ ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఈనెల16వ తేదీన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్ దేవారెడ్డి కుమారుడు రాజీవ్‌రెడ్డి, బ్రాహ్మణిలు పెద్దల ఆశీస్సులతో ఒకటయ్యారు. భారీ సెట్లు, పూల వేదికల నడుమ సాగిన ఈ కార్యక్రమానికి జనార్ధన రెడ్డి బంధు మిత్రులతో సహా రాజకీయనాయకులు హాజరై వధూవరులను దీవించారు. దాదాపు 500 కోట్ల ఖర్చుతో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్ ముద్దుగుమ్మలు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ తమ డ్యాన్సలతో ఆకట్టుకున్నారు. ఇందుకు వారు భారీ పారితోషికాలు అందుకున్నట్లు సమాచారం.
కల్యాణ మహోత్సవానికి అతిధులుగా రావాలని గాలి కుటుంబీకులు సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రానా, రవితేజ తో పాటు టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగ చైతన్య, సమంతలు పిలిచారని సమాచారం. పెళ్ళికి హాజరైతే చాలు కోట్లిస్తామని ఆఫర్ కూడా చేసారంట. ఈ ఆహ్వానాన్ని అందరూ సున్నితంగా తిరస్కరించినట్లు తాజాగా తెలిసింది. అవినీతి కేసులో ఇరుక్కున్న గాలి జనార్దన్ రెడ్డి ఇంట శుభకార్యానికి వెళితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చాలా మంది భయపడ్డారని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















