కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కి నివాళులర్పించిన సినీ ప్రముఖులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..

తెలుగు సినిమా పతాకను దిగంతాలకు ఎగిరేలా చేసిన దిగ్దర్శకుడు కాశీనాధుని విశ్వనాథ్ ఆ విశ్వనాధుని సన్నిధికి చేరిపోయారు.. ‘దొరకునా ఇటువంటి సేవ..నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేరు త్రోవ’ అంటూనే కదలి వెళ్లి పోయారు.. 92 సంవత్సరాల వయసులో వృద్దాప్య సమస్యల కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారాయన.‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’, ‘స్వర్ణకమలం’, ‘శుభసంకల్పం’, ‘స్వయంకృషి,

‘ఆపద్భాందవుడు’ ఇలా ఎన్నో అపురూపమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ విడుదలైంది. సరిగ్గా అదేరోజు అంటే అదే ఫిబ్రవరి 2 వ తేదీ, 2023 న ‘కళాతపస్వి’ పరమపదించడం కాకతాళీయం..కె.విశ్వనాథ్ మృతికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళి అర్పిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, ఎమ్.ఎమ్.కీరవాణి, బ్రహ్మానందం, జీవిత, రాజ శేఖర్, అల్లు అరవింద్ తదితరులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus