కంటతడి పెట్టుకున్న సినిమాటోగ్రాఫర్.. ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్లు వస్తాయని ఇండస్ట్రీలో అందరూ భావిస్తారు. అయితే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అయితే ఉంటాయి. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఒకరు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
సీనియర్ సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. 300కు పైగా సినిమాలకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన దేవరాజ్

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక పరిస్థితి గురించి, వ్యక్తిగత జీవితంలోని కష్టాల గురించి ఈ సీనియర్ సినిమాటోగ్రాఫర్ చెప్పుకొచ్చారు. నా తండ్రి శ్రీధర్ కెమెరామేన్ గా పని చేశారని నాన్న మరణంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నాపై పడిందని ఆయన అన్నారు. ఎంతోమందికి నేను సహాయం చేశానని అయితే ప్రస్తుతం నేను నడవలేని స్థితిలో ఉన్నానని దేవరాజ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పూట గడవడం కూడా కష్టంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

రజనీకాంత్, మురళీ మోహన్ ప్రతి నెలా కొంత మొత్తం సహాయం చేస్తున్నారని దేవరాజ్ తెలిపారు. ఎంతోమంది హీరోయిన్లను తాను సినిమాలకు రికమెండ్ చేశానని అయితే వాళ్లెవరూ ప్రస్తుతం నాకు సహాయం చేయడం లేదని దేవరాజ్ తన బాధను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నా ఆపరేషన్ కు 7 లక్షల రూపాయలు ఖర్చవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో నేను ఉన్నానని దేవరాజ్ కామెంట్లు చేశారు.

ఎందుకు బ్రతికున్నానో తెలియదని చచ్చిపోవాలని ఉందని ఆయన తన మనస్సులోని బాధను పంచుకున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు దేవరాజ్ కు ఆర్థిక సహాయం చేస్తారేమో చూడాల్సి ఉంది. ఆయన కష్టాలు తీరాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus