ఇక్కడ సరైన అవకాశాల్లేవ్‌.. అక్కడ సల్మాన్‌ ఖాన్‌తో!

తాగుబోతు రమేశ్‌.. టాలీవుడ్‌లో తాగుబోతు పాత్రలు అంటే.. ఠక్కున గుర్తొచ్చే అతి తక్కువమంది నటుల్లో ఒకరు. ఎమ్మెస్‌ నారాయణ ఈ లిస్ట్‌లో ఎవర్‌ గ్రీన్‌ అనుకుంటే.. తాగుబోతు రమేశ్‌ ఆ తర్వాత ఎక్కడో వస్తారు. అయితే ఆయనకు ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో సరైన అవకాశాలు రావడం లేదు. అయితే ఇప్పుడు ఏకంగా సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో ఛాన్స్‌ సంపాదించాడు. సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హిందీ సినిమాలో తాగుబోతు రమేశ్‌ నటిస్తున్నాడు.

సల్మాన్‌ ఖాన్‌తో సినిమా సెట్స్‌లో దిగిన ఓ ఫొటోను రమేశ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. బాలీవుడ్‌లో తొలి అడుగు.. అంటూ రాసుకొచ్చారు. అలా ‘కిసీ కీ జాన్‌ కిసీ కీ భాయ్‌’ సినిమాలో రమేశ్‌ నటిస్తున్నాడు. తెలుగులో ఆశించిన విజయం అందుకోకపోయిన ‘కాటమరాయుడు’ సినిమాకు ఆ సినిమా రీమేక్‌. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. పూజాకు అన్నయ్యగా విక్టరీ వెంకటేశ్‌ నటిస్తున్నారు. అతని సహాయ పాత్రలోనే తాగుబోతు రమేశ్ నటిస్తున్నాడట.

సౌత్‌ కథలను బాలీవుడ్‌కి తీసుకెళ్లడంలో సల్మాన్‌ ఖాన్‌ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ క్రమంలోనే ‘కాటమరాయుడు’ కథను బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నారు. ఫర్హాద్‌ షమ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబరు 30న విడుదల చేయబోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌ చాలా రోజులు జరిగింది. త్వరలో మరో షెడ్యూల్‌ ఇక్కడే చేస్తారు అని కూడా సమాచారం. దాంతో వెంకటేశ్‌ పాత్ర పూర్తవుతుందట.

ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కూడా కనిపించనున్నాడు. ఇటీవల ఈ విషయం సల్మాన్‌ ఖానే చెప్పాడు. ఓ పాటలో సల్మాన్‌, వెంకటేశ్‌, రామ్‌చరణ్‌ కనిపిస్తారట. ఆ పాట చాలా సందడిగా ఉంటుందని అంటున్నారు. ఆ పాటలో వద్దు అన్నప్పటికీ.. రామ్‌చరణ్‌ వచ్చి డ్యాన్స్‌ చేసి వెళ్లాడని సల్మాన్‌ ఖాన్‌ మొన్నీమధ్య చెప్పాడు. సల్మాన్‌ ముఖ్య పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ మంచి విజయం అందుకుంది. ఇప్పుడు తెలుగు హీరోలు కనిపిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో ఎలా ఆదరిస్తారో చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus