పక్క రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు జరపడానికి ప్రభుత్వాలు పెర్మిషన్లు ఇస్తున్నాయి. అయితే మన టాలీవుడ్ కు మాత్రం ఇప్పట్లో కష్టమని తేల్చి చెప్పేస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో జరిగిన సమావేశంలో షూటింగ్ అనుమతులు మరియు థియేటర్స్ రీ ఓపెన్ చేయించాలి అనే అంశాల పై చర్చించినట్టు తెలుస్తుంది. అయితే షూటింగ్ అంటే మాటలు కాదు. సెట్లో ఎక్కువ మంది ఉంటారు..
అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చెయ్యడం అన్నది అంత సులువైన విషయం కాదు. అయితే కొద్ది పాటి జనంతో అలాగే సామజిక దూరం పాటిస్తూ షూటింగ్ లు జరుపుతాం అని మన నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తుంది. అయితే ముందుగా ఈ విషయం పై మనవాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే రాజమౌళికి ఈ బాధ్యతను అప్పగించారని తెలుస్తుంది. అతి తక్కువ మంది క్యాస్టింగ్ రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ ను జరపగలిగితే
ఆ తరువాత మిగిలిన మేకర్స్ కు కూడా పెర్మిషన్ ఇప్పించే అవకాశం ఏర్పడుతుందని చిరంజీవి మరియు అల్లు అరవింద్, దిల్ రాజు వంటివారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి సెట్ లో ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటాడు, ఒక ప్రిన్సిపల్ లా అందరినీ లీడ్ చేస్తాడని అతనితో పనిచేసిన వారు చెబుతుంటారు. అందుకే రాజమౌళి అయితేనే కరెక్ట్ అని మన వాళ్ళు కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్