పూరీ, కొరటాల, వినాయక్ లను చూసి డైరెక్టర్లు మారాల్సిందే!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ లో ఉన్న హీరోలు, డైరెక్టర్ల ముందు నిర్మాతలు క్యూ కడతారు. భారీ మొత్తంలో రెమ్యునరేషన్లను ఆఫర్ చేస్తారు. హీరోలు, దర్శకులు కోరిన ప్రతి డిమాండ్ ను నిర్మాతలు నెరవేరుస్తారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరోలు, దర్శకులపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. హీరోలు కథలో వేలు పెట్టడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని పలు సందర్భాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.

దర్శకుడు వి.వి.వినాయక్ ఆది సినిమా నుంచి ఖైదీ నంబర్ 150 సినిమా వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. సక్సెస్ రేట్ ఎంతో ఎక్కువగా ఉన్న దర్శకులలో వినాయక్ ఒకరు. అయితే అఖిల్, ఇంటెలిజెంట్ సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల వినాయక్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు వినాయక్ తో పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఛత్రపతి రీమేక్ తో సక్సెస్ సాధిస్తే మాత్రమే టాలీవుడ్ హీరోలు వినాయక్ ను నమ్మే ఛాన్స్ ఉంది.

మరో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ తొలినాళ్లలో తెరకెక్కించిన సినిమాలు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలుసు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, శివమణి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు, బిజినెస్ మేన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో పూరీ సక్సెస్ లను అందుకున్నారు. అయితే లైగర్ ఫ్లాప్ వల్ల పూరీ జగన్నాథ్ తో పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపడం లేదు. లైగర్ ఫ్లాప్ విషయంలో ఎక్కువమంది పూరీ జగన్నాథ్ ను నిందించారు.

ఆచార్య మూవీ ఫ్లాప్ విషయంలో కూడా అన్ని వేళ్లు కొరటాల శివ వైపు చూపిస్తున్నాయి. ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల పూరీ జగన్నాథ్, వినాయక్, కొరటాల శివలపై పడిన నిందలు అన్నీఇన్నీ కావు. తర్వాత సినిమాలతో దర్శకులు ఈ మరకలను చెరిపేయాల్సి ఉంది. ఈ టాలీవుడ్ దర్శకులు తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా సక్సెస్ లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. పూరీ, వినాయక్, కొరటాల శివలను చూసి సినిమాలు ఫ్లాప్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో దర్శకులు మారాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus