ఓ బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడికి.. ఓ రేంజ్లో డిమాండ్ ఏర్పడుతుంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుండీ ఆ దర్శకులకు ఆఫర్లు వస్తుంటాయి. అయితే కొంతమంది దర్శకుల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఏళ్ళ తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు ఆ డైరెక్టర్లకు.! ఒకవేళ ఛాన్స్ దొరికినా సినిమాను తెరకెక్కించలేని పరిస్థితి, షూటింగ్ మొదలు పెట్టినా ఫినిష్ చెయ్యలేని పరిస్థితి. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్లు ఓ లుక్కేద్దాం రండి :
1) సుకుమార్
2018 ‘రంగస్థలం’ అనే బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించాడు దర్శకుడు సుకుమార్.ఆ చిత్రం ‘నాన్ బాహుబలి’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తరువాత మహేష్ బాబుతో ఓ సినిమా చెయ్యాలి అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. తరువాత అల్లు అర్జున్ తో ‘పుష్ప’ ప్రాజెక్టు ని ఓకే చేయించుకున్నాడు. కానీ ఇప్పుడు వైరస్ మహమ్మారి కారణంగా ఆ ప్రాజెక్టుని తెరకెక్కించలేని పరిస్థితి ఏర్పడింది. ‘పుష్ప’ పూర్తయ్యే సరికి 2021 సమ్మర్ కూడా పూర్తయిపోతుంది. కాబట్టి సుకుమార్ సినిమా 3 ఏళ్ళ తరువాత చూస్తామన్న మాట..!
2) కొరటాల శివ
2018 లో ‘భరత్ అనే నేను’ తో హిట్ అందుకున్నాడు కొరటాల శివ. ఆ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చెయ్యాలి అని రెండేళ్ల పాటు ఖాళీగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు వైరస్ మహమ్మారి కారణంగా కొరటాలకు మరో ఏడాది వేస్ట్ అయిపోయినట్టే అని చెప్పాలి.
3) వంశీ పైడిపల్లి
2019 లో ‘మహర్షి’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించాడు వంశీ పైడిపల్లి. ఆ చిత్రం వచ్చి ఏడాది పైనే అయ్యింది. ఇంకా తన తరువాతి సినిమా పట్టాలెక్కించే అవకాశం దక్కలేదు.
4) పరశురామ్(బుజ్జి)
2018లో ‘గీత గోవిందం’ తో అత్యధిక లాభాలను మిగిల్చిన చిత్రాన్ని అందించాడు పరశురామ్(బుజ్జి).ఆ చిత్రం తరువాత రెండేళ్ల వరకూ ఇతనికి ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. నాగ చైతన్యతో సినిమా ఓకే చేయించుకున్నాడు. కానీ మధ్యలో మహేష్ నుండీ పిలుపు రావడంతో ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టు ఓకే అయ్యింది. కానీ వైరస్ మహమ్మారి వల్ల ఆ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకువెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
5) సందీప్ రెడ్డి వంగా
2017 లో ‘అర్జున్ రెడ్డి’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా.. అదే చిత్రాన్ని బాలీవుడ్లో ‘కబీర్ దాస్’ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ఆందుకున్నాడు. అయితే తెలుగులో అతని రెండో చిత్రం మాత్రం ఇంకా ఓకే అవ్వలేదు.
6) అజయ్ భూపతి
2018లో ‘ఆర్.ఎక్స్.100’ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న అజయ్ భూపతి.. తన రెండో చిత్రమైన ‘మహా సముద్రం’ ను ఇంకా ఆఫిషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు. శర్వానంద్ -సిద్దార్థ్ లతో ఆ ప్రాజెక్టు ఓకే అయ్యింది అని అంటున్నారు. కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
7) వేణు శ్రీరామ్
2017 లో ‘ఎం.సి.ఎ’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన వేణు శ్రీరామ్.. తరువాత అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు ఓకే అవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని ఓకే చేయించుకున్నాడు.కానీ వైరస్ మహమ్మారి వల్ల ఆ ప్రాజెక్టుని పూర్తి చెయ్యలేకపోతున్నాడు.
8) రాహుల్ సంక్రుత్యాన్
2018 లో ‘టాక్సీ వాలా’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు రాహుల్ సంక్రుత్యాన్. తన రెండో చిత్రమైన ‘శ్యామ్ సింగ రాయ’ ను నానితో తెరకెక్కించాలి అనుకున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. అందుకే నిర్మాతలు ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్టు టాక్ నడుస్తుంది.
9) గౌతమ్ తిన్ననూరి
2019లో ‘జెర్సీ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం ఇంకా ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
10) శేఖర్ కమ్ముల
2017 లో ‘ఫిదా’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న శేఖర్ కమ్ముల.. రెండేళ్ల తరువాత నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ ని మొదలుపెట్టాడు. ఆ ప్రాజెక్టు ఇంకా కంప్లీట్ అవ్వలేదు.