చరణ్ – బాలయ్య – పవన్.. ఫ్యాన్స్ కు పండగే

ఈ దీపావళి సందర్భంగా టాలీవుడ్ (Tollywood) నుంచి పెద్ద సినిమాల విడుదల కాకపోయినా, అభిమానుల్ని ఎగ్జైట్ చేసే అప్‌డేట్స్ మాత్రం రావడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలేవీ థియేటర్లలో సందడి చేయకపోవడం కొంత నిరాశ కలిగించే విషయం అయినప్పటికీ, అభిమానుల హృదయాల్లో కొత్త సినిమాల అప్‌డేట్స్ టపాసుల్లా పేలబోతున్నాయి. విడుదలయ్యే సినిమాలలో ముందుగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tollywood

అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘క’తో ఈ ఫెస్టివల్ సీజన్ లో పోటీనిస్తాడు. ఈ రెండు సినిమాలపై ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే టాక్ బట్టి దీపావళిలో క్లిక్కయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఈ దీపావళికి చాలా క్రేజీ సినిమాల నుంచి అప్‌డేట్స్ రాబోతున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ మూవీ టీజర్ దీపావళి రోజునే రిలీజ్ అవుతుందని ఖాయమైంది. సినిమా బజ్ కు ఇది చాలా కీలకం.

అలాగే బాలయ్య నటిస్తున్న ‘NBK109’ టైటిల్ కమ్ టీజర్, వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీజర్ కూడా అదే రోజున రాబోతోంది. వీటితో పాటు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ సింగిల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆ సాంగ్ పాడినట్లు టాక్. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అలాగే ‘పుష్ప 2’ నుంచి మాసివ్ అప్డేట్ కూడా రానుంది, నాగ చైతన్య మూవీ ‘తండేల్’ అప్డేట్, నితిన్ రాబిన్ హుడ్ మూవీ అప్‌డేట్ లు కూడా విడుదల కానున్నాయి. ఈ అప్‌డేట్స్ తో అభిమానుల హృదయాల్లో దీపావళి ఉత్సవం మంచి సందడి తీసుకురాబోతుందని చెప్పవచ్చు.

 ‘మా నాన్న సూపర్ హీరో’ … బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus