Manchu Vishnu: మా బిల్డింగ్ గురించి క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటి!

ప్రముఖ సీనియర్ నటీమణులలో ఒకరైన బొంబాయి పద్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు యండమూరి వీరేంద్రనాథ్ మొదట అవకాశం ఇచ్చారని అన్నారు. ఆయన సూచన మేరకు ప్రియురాలు పిలిచింది సీరియల్ లో చేశానని ఆమె తెలిపారు. ఫస్ట్ సీరియల్ కు 350 రూపాయలు రెమ్యునరేషన్ అని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఒక మామూలు ఆర్టిస్ట్ నని ఆమె చెప్పుకొచ్చారు. ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా నన్ను రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బందులు పెట్టారని ఆమె వెల్లడించారు.

రెండు రోజులు పని చేశానని 6000 రూపాయల రెమ్యునరేషన్ తనకు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదని ఆమె చెప్పుకొచ్చారు. డబ్బులను బట్టి ఖర్చులు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. డబ్బుల కోసం అడిగితే తర్వాత సినిమాలలో ఆఫర్లు ఇవ్వరని ఆమె పేర్కొన్నారు. నేను మూడేళ్ల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్ తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. విష్ణుగారు మా అసోసియేషన్ బిల్డింగ్ ను సొంత డబ్బుతో కట్టిస్తానని అన్నారని ఆమె తెలిపారు.

మంచు విష్ణు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారని ఆమె అన్నారు. కొన్ని నెలల క్రితం మీటింగ్ జరిగిందని ఆరు నెలల తర్వాత బిల్డింగ్ పనులు మొదలుపెడతానని మంచు విష్ణు హామీ ఇచ్చారని ఆమె అన్నారు. నరేష్ గారు కోరడం వల్లే మంచు విష్ణుకు ఓటేశానని ఆమె పేర్కొన్నారు. అప్పట్లో నాకు రోజుకు 350 వచ్చేదని ఇప్పుడు 3500 రూపాయలు వస్తోందని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుని సినిమాల్లో నటించానని ఆమె అన్నారు. బాహుబలి, బ్రహ్మోత్సవం సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్ గా నేను కోరుకుని వెళ్లానని ఆమె తెలిపారు. రాజమౌళి గారితో నేను శాంతినివాసం సీరియల్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు. కొంతమంది సినిమా అవకాశాల విషయంలో వీలైనంత హెల్ప్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. గతేడాది డిసెంబర్ లో నాకు యాక్సిడెంట్ జరిగిందని ఆమె అన్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus