కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవగా గత నెలలో విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ నెలలో విడుదల కావాల్సిన పుష్ప2 డిసెంబర్ కు వాయిదా పడిన నేపథ్యంలో ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ అభిమానుల మధ్య జరుగుతుండటం గమనార్హం. సినీ అభిమానులు ఆగష్టు నెలపై చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఈ నెలలో విడుదల కానున్న సినిమాలలో డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) , మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan), సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్దాయి.
ఈ మూడు సినిమాలలో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకే రోజు ఆగష్టు నెల 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా సరిపోదా శనివారం సినిమా మాత్రం ఆగష్టు నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆగష్టు నెలలో రిలీజ్ కానున్న ఈ సినిమాల బడ్జెట్ దాదాపుగా 300 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఈ సినిమాలకు బిజినెస్ కూడా ఒకింత భారీ స్థాయిలో జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వచ్చే నెల నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, సరిపోదా శనివారం సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది.
క్రేజ్ ఉన్న డైరెక్టర్లు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. ఈ మూడు సినిమాలు ఆయా హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఈ సినిమాలు బిజినెస్ పరంగా కూడా అదరగొడుతున్నాయి.