ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ అనేది.. మెగాస్టార్ చిరంజీవి – నటసింహ బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య తారాస్థాయిలో ఉండేది.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని.. తమది జెన్యూన్ రికార్డ్ అంటే తమదే జెన్యూన్ రికార్డ్ అని.. థియేటర్ల సంఖ్య, 50, 100, 175 రోజుల సెంటర్లు, కలెక్షన్ల విషయంలో రచ్చ రచ్చ చేసేవారు.. క్రమంగా ఫ్యాన్ వార్స్ తగ్గాయి అనుకుంటే సామాజిక మాధ్యమాల రూపంలో మరో స్థాయికి వెళ్లిపోయాయి.
సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే చాలు.. ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ ఫలానా సినిమా ఇంత కలెక్ట్ చేసింది.. గ్రాస్ ఇది, షేర్ ఇంత అంటూ లెక్కలు చెప్తున్నారు. సీనియర్ హీరోల నుండి ఇప్పటి యంగ్ హీరోస్ ఫ్యాన్స్.. అలాగే తమిళ పరిశ్రమకు చెందిన అజిత్ – విజయ్ అభిమానులు ట్విట్టర్‌లో ఒకరి సినిమాలను ఒకరు విమర్శించుకుంటూ.. ఫేక్ రికార్డ్స్ అని ప్రూఫ్స్ చూపిస్తూ పరస్పరం దూషించుకుంటుంటారు. ఇక అప్‌డేట్స్ విషయంలో ఏకంగా దర్శక నిర్మాతలను, పీఆర్‌వోలనే బెదిరిస్తూ.. హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తుంటారు..
దీని గురించి అసహనం వ్యక్తం చేస్తూ ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్ పోస్ట్ చేయడం.. కొంతమంది సోషల్ మీడియా నుండి వైదొలగడం.. ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులను కూడా విజ్ఞప్తి చేస్తూ మాట్లాడడం వరకు వచ్చిందంటే.. అభిమానం పేరుతో వారి విచ్చలవిడితనం ఏంటనేది అర్థమవుతోంది.. అభిమానం ఉండొచ్చు కానీ అది హద్దులు దాటకూడదు.. దురాభిమానం కాకూడదు..
ఇప్పటి విషయానికొస్తే.. తమ హీరో మీద తమకున్న ప్రేమను వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చూపించే డైహార్డ్ ఫ్యాన్స్.. ఇప్పుడు ‘నిన్ను ఏమీ అనలేను.. నీదాకా వస్తే ఊరుకోను’ అనే సరికొత్త నినాదంతో సందడి చేస్తున్నారు. నెట్టింట ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది.. ప్రభాస్, బాలయ్య, మషేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాగార్జునతో పాటు అనుష్క అభిమానులు కూడా పోస్టులతో హంగామా చేస్తున్నారు..
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!