ఫ్లాప్స్ వచ్చినా హీరోల రెమ్యునరేషన్స్ తగ్గట్లే!

సినిమా ఇండస్ట్రీలో హీరోల (Heroes)  మార్కెట్ అనేది పూర్తిగా వసూళ్లపై ఆధారపడి ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో వసూళ్లను మర్చిపోయి హీరోలు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ, నిర్మాతలపై భారీ భారం మోపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏళ్ల తరబడి హిట్ లేకున్నా కొందరు హీరోలు రూ.7 కోట్లు నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేయడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి పరిస్థితిలో మిడ్ రేంజ్ హీరోల (Heroes) సినిమాలకు ఓపెనింగ్స్ కూడా తక్కువగా వస్తున్నాయి.

Heroes

థియేట్రికల్ బిజినెస్ గాడితప్పింది, ఓటీటీ డీల్స్ పెద్దగా రావడం లేదు. అయినా కూడా ప్రతిసారి నిర్మాతలు ఈ హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మార్కెట్ తగ్గిపోయినా రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ఫైనల్‌గా, నిర్మాతలే నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శర్వానంద్ (Sharwanand), గోపీచంద్ (Gopichand) వంటి హీరోల పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. వీళ్లిద్దరూ చాలా కాలంగా పెద్దగా హిట్స్ లేకుండా కొనసాగుతున్నారు. సుధీర్ బాబు కూడా అప్పుడప్పుడు సక్సెస్ అందుకున్నా, ఓపెనింగ్స్ పరంగా చూస్తే పెద్దగా ఆశించలేని స్థితిలో ఉన్నాడు.

రవితేజ (Ravi Teja) లాంటి హీరోలు కూడా ‘ధమాకా’ (Dhamaka) తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులలోనే ఉన్నారు. అయినా కూడా, ఈ హీరోలు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ శర్వానంద్ రూ.9 నుంచి రూ.10 కోట్లు తీసుకుంటున్నాడట. గోపీచంద్ కూడా రూ.7 కోట్లు వరకూ డిమాండ్ చేస్తున్నాడు. మెగా హీరోలు కూడా ఈ లిస్టులోనే ఉన్నారు. చిన్న రేంజ్ హీరోలు కూడా రూ.1 కోటి వరకూ తీసుకుంటూ, నిర్మాతలకు నష్టాలను మిగల్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఇండస్ట్రీలో ప్రతి ఏడాదీ ఏదో ఒక సినిమా భారీ నష్టాల్లో పడిపోవడానికి కారణం కూడా ఇదే. అయితే, సినిమా తీయాలనే ఉత్సాహంతో కొందరు నిర్మాతలు ఈ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. బిజినెస్ లెక్కలు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చివరికి నష్టాలు మిగిలిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ సినిమాలు పెద్దగా హైప్ కూడా లేకుండా రిలీజై, డిజాస్టర్ అవుతున్నాయి.

అయినా కూడా అదే తీరులో సినిమాలు రావడం పరిశ్రమలో ఉన్న దోషాలను బయటపెడుతోంది. ఈ ట్రెండ్ ఎప్పటివరకు కొనసాగుతుందో చెప్పలేం. కానీ నిర్మాతలు జాగ్రత్తగా లెక్కలు వేసుకోకపోతే, ఇండస్ట్రీలో మరిన్ని ఆర్థిక సంక్షోభాలు తప్పవు. హీరోల మార్కెట్‌ను బట్టి వారి రెమ్యూనరేషన్ నిర్ణయించకపోతే, చిన్న, మధ్య తరహా నిర్మాతలే కాకుండా పెద్ద నిర్మాతలూ కష్టాల్లో పడే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈమెకసలు సినిమాలు అవసరమా అంటూ ఫైర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus