టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. దర్శకుడు సాగర్ మృతి చెంది రెండు రోజులు పూర్తికాకుండానే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ (కె.విశ్వనాథ్) కన్నుమూశారు. ఈయన వయసు 92 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు .
దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. విశ్వనాథ్ గారు ఓ లెజెండరీ డైరెక్టర్. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి, జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన దర్శకుడు. ఎంతో మంది స్టార్ హీరోలను అందించిన వ్యక్తి. సినీ పరిశ్రమకు ఇన్ని సేవలు చేసిన ఆయన..
మరణించడం టాలీవుడ్ కు తీరని లోటుగానే భావించాలి. అందుకే ఆయన మరణానికి చింతిస్తూ టాలీవుడ్ పరిశ్రమ ఈరోజు స్వఛ్చందంగా షూటింగ్ లు బంద్ చేస్తున్నట్టు పిలుపునిచ్చింది.మహానుభావుడు విశ్వనాథ్ గారికి ఈ రూపంలో తమ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు చెప్పుకొచ్చింది.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?