ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ హీరో, నటుడు మృతి..!

సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటునే ఉండడం సినీ ప్రముఖులను ఆందోళన కలిగిస్తుంది. ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులు మరణించిన సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. టాలీవుడ్లోనే కాకుండా మిగిలిన భాషల నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్లు,సింగర్లు, చాలా మంది మరణించారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈరోజు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు.

ఆ షాక్ నుండీ సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే ఈరోజు మరో సీనియర్ హీరో మరణించడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే…ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో విద్యాసాగర్ కన్నుమూశారు. ఈ చదువులు మాకొద్దు అనే చిత్రంతో ఈయన హీరోగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన జంద్యాల తెరకెక్కించిన అనేక చిత్రాల్లో నటించారు.

ఇంకా చాలా చిత్రాల్లో నటించారు. అటు తర్వాత ఈయన అనారోగ్యం పాలై వీల్ చెయిర్ కు పరిమితమయ్యారు. ఇక ఇటీవల ఈయన ఆరోగ్యం క్షీణించి మరణించారు. ఈయన మరణ వార్తను జోష్ రవి తెలియజేశాడు. ఈయన మరణానికి చింతిస్తూ పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus