వంద చిత్రాలు పూర్తి చేసిన తెలుగు హీరోలు

  • January 18, 2017 / 11:46 AM IST

వందకి వంద మార్కులు సాధిస్తే మంచి విద్యార్థి అని అభినందిస్తారు. క్రికెట్ లో వంద రన్స్ చేస్తే భలే ఆడాడురా అంటారు. ఇలా వంద అనే మాటకి ఓ ప్రత్యేక విలువ ఉంది. ఈ విలువ సినిమా వారికి మరింత పెరుగుతుంది. తాము నటించిన చిత్రం వంద రోజులు ఆడితే అన్ని వర్గాల ప్రజలకు నచ్చినట్లు ఆనందపడిపోతారు. మన హీరోలు ప్రతి సినిమా వందరోజులు ఆడాలని కష్టపడుతుంటారు. అంత శ్రమించి వంద చిత్రాలను పూర్తి చేస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి వంద సినిమాల మైలు రాయిని క్రాస్ చేసిన తెలుగు హీరోలపై ఫోకస్.

మోహన్ బాబుడైలాగ్ కింగ్ మోహన్ బాబు అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పుపొందారు. హీరోయిజం చూపించినా, విలనిజం ప్రదర్శించినా తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. తన కొడుకులు, కూతురు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించి విజయతీరానికి చేర్చారు. ఆయన ఇప్పటివరకు 560 చిత్రాల్లో నటించారు.

కృష్ణసూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. ఆయన ఇప్పటివరకు 345 చిత్రాల్లో నటించి అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. తొలితరం హీరోల్లో ఒకరైన కృష్ణ ఇప్పటికీ నటించడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు.

మురళీ మోహన్సాంఘిక కథల హీరోగా మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు మురళీ మోహన్. ఇతను యవ్వనంలో హీరోగా నటించి అనంతరం వయసుకు తగ్గ పాత్రలలో ఇమిడిపోయారు. ఇప్పటివరకు 350 చిత్రాల్లో నటించారు.

ఎన్టీఆర్మహా నటుడు నందమూరి తారక రామారావు తన నటనతో దేవుళ్లను కళ్ళకు కట్టారు. సాంఘికం, పౌరాణికం అంటూ తేడాలేకుండా అన్ని రకాల కథలతో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లారు కాబట్టి 303 సినిమాలకే పరిమితయ్యారు కానీ .. లేకుంటే మరో సెంచురీ పూర్తి చేసేవారు.

ఏఎన్నార్ఆఖరి శ్వాస ఉన్నంతవరకు నటనే జీవితంగా బతికిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. నూనూగు మీసాలు ఉన్నపుడు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి కొన్ని రోజుల్లో చనిపోతున్నానని తెలిసి కూడా మనం చిత్రంలో నటించారు. ఆఖరి చిత్రం కూడా ఏఎన్నార్ కి బ్లాక్ బస్టర్ అయింది. దీంతో ఆయన నటించిన చిత్రాల సంఖ్య 256 .

కృష్ణంరాజురెబల్ స్టార్ కృష్ణం రాజు నటనా కాలం ఎక్కువైనప్పటికీ ప్రత్యేకమైన కథలనే ఎంపిక చేసుకొని ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్నారు. 197 చిత్రాల్లో నటించిన ఈయన అతి త్వరలో 200 మైలు రాయిని క్రాస్ చేయనున్నారు.

చిరంజీవిమెగాస్టార్ చిరంజీవి హీరోగా ఖైదీ నంబర్ 150 సినిమాతో 150 చిత్రాలను పూర్తి చేశారు. పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ స్కోర్ తక్కువగా ఉంది కానీ లేకుంటే చిరు టు సెంచరీ ఎప్పుడో చేసేవారు.

రాజేంద్ర ప్రసాద్అప్పట్లో రోజుకు మూడు చిత్రాల్లో నటించిన బిజీ హీరో నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్. చాలా వేగంగా అనేక సినిమాలు పూర్తి చేశారు. హీరోగా దాదాపు 150 చిత్రాలు చేశారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా మరో 45 చిత్రాల్లో కనిపించారు.

శోభన్ బాబుసోగ్గాడు శోభన్ బాబు అందంతో, అభినయంతో మహిళా హృదయాలను గెలుచుకున్నారు. ఇతను క్యారక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు. ప్రధాన పాత్రల్లో నటిస్తూ 120 చిత్రాలను కంప్లీట్ చేశారు. అభిమానుల కోసం వృద్యాప్యంలో నటించకూడదని నిర్ణయం తీసుకొని కలల రాకుమారిడిగా మిగిలి పోయారు.

బాలకృష్ణతన వందో చిత్రం స్థిరస్థాయిగా మిగిలిపోయేలా నటసింహ నందమూరి బాలకృష్ణ కథను ఎంచుకున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణిగా వచ్చి విజయం అందుకోవడమే కాదు.. వంద కోట్ల క్లబ్బులో చేరి తెలుగు సినీ చరిత్రలో బాలయ్య వందో చిత్రం ఓ పేజీ దక్కించుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus