నవలల్లో ఒక పాత్ర ఎలాంటి వాడో చెప్పాలంటే ఆ క్యారక్టర్ కథలోకి ఎంట్రీ కాకముందే వివరంగా చెప్పాలి. సినిమాలో అయితే ఆ క్యారక్టర్ ఎంట్రీ అయ్యేటప్పుడే చూపించాలి. అలా అని గంటల కొద్దీ అతని గురించే చెప్పడానికి వీలు లేదు. ముఖ్యంగా కమర్షియల్ చిత్రాల్లో అయితే ఒకే ఒక్క సీన్లోనే హీరో ఎంత స్ట్రాంగో చెప్పాలి. ఎంతటి తెలివి తేటలు కలవాడో చూపించాలి. అందుకే మన దర్శకులు హీరో ఇంట్రడక్షన్ సీన్ ని చాలా బాగా అలోచించి తెరకెక్కిస్తారు. ఆ సన్నివేశం ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపిస్తుంది. తెలుగు సినిమాల్లో బెస్ట్ అనిపించుకున్న కొన్ని హీరో ఇంటర్డక్షన్ సీన్ల పై ఫోకస్…
1. స్టాలిన్
మెగాస్టార్ చిరంజీవి హిట్ చిత్రాల్లో స్టాలిన్ ఒకటి. తమిళ దర్శకుడు ఏఆర్.మురుగ దాస్ తెరకెక్కిన ఈ సినిమాలో చిరు ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. మెగాస్టార్ నడుచుకుని వస్తుంటే థియేటర్లలో అభిమానులు విజిల్స్ తో అదరగొట్టారు. ఇక్కడ ఫైట్ ద్వారా స్టాలిన్ ఎంత స్ట్రాంగో చూపించారు.
2. గబ్బర్ సింగ్
బ్యాంక్ లో దొంగతనం జరిగింది, దొంగలను పట్టుకోవాలి. ఇరవైమంది కి పైగా పోలీసులు నాలుగైదు మార్గాల్లో తమ వాహనాల్లో ఛేజ్ చేస్తే వారు దొరకవచ్చు. కానీ ఒక్కడే ఆ దొంగల భరతం పడితే.. అతన్ని చాలా పవరున్న పోలీస్ ఆఫీసర్ అంటాం. అలా అనాలనే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా చూపించాడు. ఒక్కడే వెళ్లి దొంగలను చీల్చి చెండాడి డబ్బులు తీసుకొచ్చేలా తీసాడు.
3. పోకిరి
సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా మాస్ గా నటించిన చిత్రం పోకిరి. ఇందులో ప్రిన్స్ క్యారక్టర్ ని తన స్టైల్ లో చూపించాడు పూరి జగన్నాథ్. ఒక సారి పని ఒప్పుకున్నాక.. ఆ పని ఎంత కష్టమైనా, అందులో ఎంత రిస్క్ ఉన్నా వెనుకడుగు వేయడని పండు ఇంట్రడక్షన్ సీన్ ద్వారా డైరక్టర్ చెప్పారు.
4. సింహ
యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను సింహ చిత్రంలో భారీ ఫైట్ తో నందమూరి బాలకృష్ణ ను పరిచయం చేయిస్తాడు. ఇతరులు ఆపదలో ఉంటే తన పనిని సైతం లెక్కచేయడని హీరో మనసును చెబుతూనే.. 28 ఏళ్లు కోమాలో ఉన్న వ్యక్తిని సైతం ఒక దెబ్బతో మేల్కొలిపే శక్తి అతని ఒంట్లో ఉందని ఈ ఇంట్రడక్షన్ సీన్ ద్వారా దర్శకుడు చూపించాడు.
5. ఊసరవెల్లి
ఈ ఆర్టికల్ లో మొదట చెప్పినట్లు సురేందర్ రెడ్డి హీరో ఎంట్రీ ని నవల రూపంలో ఇంట్రస్టింగ్ గా చూపించాడు. హీరో బలం, బలహీనత, ఇష్టం, అయిష్టాలను పక్క వారితో చెప్పించి కొత్తదనం తీసుకొచ్చాడు. ఊసరవెల్లి సినిమా ప్రారంభంలో టోనీ ఊసరవెల్లి లాంటి వాడు అని తెలివిగా తెరకెక్కించాడు. ఎన్టీఆర్ సినిమాల్లో ఇంటర్డక్షన్ సీన్లకు భిన్నంగా ఉండడంతో ఇది బాగా క్లిక్ అయింది. ఈ సీన్లో ఓ మహిళా టోనీ గురించి “ఎదురుగా ఎలాంటి వాడున్న తల దన్నేవాడిలా ఉంటాడు..” అని చెబుతుంది. ఈ ఒక్క మాటతో టోనీ ని ఆడియన్స్ మైండ్ లో ఫిక్స్ చేయించాడు.
6. ఛత్రపతి
ఛత్రపతి సినిమాలో హీరో చంపే రకమే కానీ.. చచ్చే రకం కాదని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇంటర్డక్షన్ సీన్ ద్వారా చెప్పాడు. ప్రభాస్ సొర చేపతో ఫైట్ తో డిజన్ చేసి హీరో ఎంత బలవంతుడో ఒక్క సీన్ ద్వారా చూపించాడు.
7. బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కమర్షియల్ హీరోగా చేసిన చిత్రం బన్నీ. హీరో పేరు వినడానికి చాలా ముద్దుగా ఉన్నా.. అతను మాత్రం చాలా స్మార్ట్. మెగా స్ట్రాంగ్. ఆ విషయాన్నీ వి.వి.వినాయక్ చిన్న ఫైట్ కి కొంచెం కామెడీని జోడించి ఇంటర్డక్షన్ సీన్ ద్వారా చెప్పాడు. ఈ సన్నివేశం బాగా పండింది.
8. ఘర్షణ
ఇంటర్డక్షన్ సీన్లు అని ఒకేలా ఉండాలని రూల్ లేదని చాటిన డైరక్టర్ గౌతమ్ మీనన్. ఘర్షణ సినిమాలో విక్టరీ వెంకటేష్ ని కొత్తగా ప్రజంట్ చేసాడు. “రామచంద్ర ఐపీఎస్. నా పేరు వెనుక మూడు అక్షరాలే నా జీవితం, నా తపస్సు. 24 ఏళ్ల తపస్సు” అంటూ హీరో తన గురించి తానే పరిచయం చేసుకుంటాడు. ఆ కథకి అదే కరక్ట్ ఇంటర్డక్షన్ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది.
9. చిరుత
చిరుత పులి లాంటి యువకుడు. ఎటువంటి మృగాలనైనా వేటాడేస్తాడు. సింగిల్ సీన్లో కన్వే చేయాలి, ఇది కథ కోసం. హీరో ఫేస్ డిఫరెంట్ గా రివీల్ కావాలి, ఇది మెగాస్టార్ అభిమానుల కోసం. డైరక్టర్ పూరి జగన్నాథ్ ఈ రెండు విషయాల్లో విజయం సాధించాడు. చిరుతలో హీరో రామ్ చరణ్ తేజ్ ఇంటర్డక్షన్ ని చాలా బాగా ప్లాన్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు.
10. రక్త చరిత్ర
సినీ గ్రామర్ ఫాలో అవ్వకుండా కొత్త గ్రామర్ రాసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటివరకు ఇంటర్డక్షన్ అనగానే మంచి ఫైట్ ద్వారా చెప్పే వారి గురించే మాట్లాడుకున్నాం.. కానీ హీరో ఎలాంటి వాడు.. ఎంత భయంకరమైన వాడు అని ఒక రక్తపు బొట్టు చిందకుండానే .. పాట ద్వారా పరిచయం చేసి తన స్టైల్ ని చూపించారు వర్మ. అందుకే సినీ చరిత్రలో ఆయనకు, అయన సినిమాలకే కాదు.. సీన్లకు చోటు ఉంది.