Ravi Teja: వాళ్ల నమ్మకాన్ని మాస్ మహారాజ్ నిలబెట్టుకుంటారా?

మాస్ మహారాజ్ రవితేజ గతేడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే క్రాక్ సక్సెస్ సాధించినా ఖిలాడీ మూవీ డిజాస్టర్ కావడంతో రవితేజ ఖాతాలో ఫ్లాప్ చేరింది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ ఈ నెల 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

శరత్ మండవ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వేణు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా ఈ సినిమా తర్వాత వేణు వరుస ఆఫర్లతో బిజీ అవుతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నెలలో రిలీజైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్, గార్గి, ది వారియర్, థాంక్యూ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.

జులై నెలలో విడుదలైన సినిమాతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సిన బాధ్యత రవితేజపై ఉంది. శరత్ మండవ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలడని ట్రైలర్ తో ప్రూవ్ చేసుకున్నారు. రామారావ్ ఆన్ డ్యూటీ సక్సెస్ సాధిస్తే శరత్ మాండవకు మూవీ ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. శరత్ మండవ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. శరత్ సైతం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలను చెబుతున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సక్సెస్ సాధిస్తే రవితేజ తర్వాత సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. రవితేజ కెరీర్ లో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కంటెంట్ బలంగా ఉంటే రవితేజ హిట్టు కొట్టినట్టేనని రవితేజ త్వరలో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus