Tollywood: టాలీవుడ్ డైరెక్టర్లు మారాల్సిన సమయం ఆసన్నమైందా?

ఈ నెల 5వ తేదీన థియేటర్లలో బింబిసార, సీతారామం సినిమాలు విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఈ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అవుతాయని ఈ రెండు సినిమాలు ఒక విధంగా ప్రూవ్ చేశాయి. బింబిసార టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా కాగా సీతారామం మూవీ ఎమోషనల్ లవ్ స్టోరీ కావడం గమనార్హం.

టాలీవుడ్ స్టార్స్ సైతం ఈ రెండు సినిమాల విజయాలను ప్రశంసిస్తున్నారు. చిరంజీవి తన పోస్ట్ లో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధ పడుతున్న సినిమా ఇండస్ట్రీకీ ఈ సినిమాల విజయాలు ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పుకొచ్చారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేస్తూ శుక్రవారం విడుదలైన రెండు సినిమాలు సక్సెస్ సాధించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని చిరంజీవి చెప్పుకొచ్చారు. బింబిసార, సీతారామం సినిమాల నటీనటులు, నిర్మాతలు, టెక్నీషియన్లకు చిరంజీవి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మరో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాల విజయాల గురించి స్పందిస్తూ ఒకేరోజు రిలీజైన రెండు సినిమాలు సక్సెస్ సాధించాయని తెలిసి ఆనందంగా ఉందని అన్నారు. చాలారోజుల తర్వాత థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో థియేటర్ల ఓనర్లు, సినీ ప్రముఖులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హీరో కళ్యాణ్ రామ్ కు, దర్శకుడు హను రాఘవపూడికి సక్సెస్ కీలకం కాగా బింబిసార, సీతరామం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. స్టార్ డైరెక్టర్లు అయినా కంటెంట్ పై దృష్టి పెడితే మాత్రమే సక్సెస్ దక్కుతుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus