Tollywood, Kollywood: తమిళ ఆడియన్స్ కు ఆ సినిమాలే నచ్చుతున్నాయా?

ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఉన్న కథలను ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోలు నటించినా రొటీన్ మాస్ మసాలా కథలను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. గతేడాది సక్సెస్ సాధించిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది. హిట్ టాక్ వచ్చిన సినిమాలకు థియేటర్ల దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తుంటే ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు ఫస్ట్ వీకెండ్ వరకు మాత్రమే కలెక్షన్లను సాధిస్తున్నాయి. అయితే తమిళంలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది.

Click Here To Watch

రొటీన్ మాస్ మసాలా సినిమాలనే అక్కడి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. తాజాగా అజిత్ నటించిన వలిమై రిలీజ్ కాగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ రాలేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. తమిళంలో విజయ్ రొటీన్ మాస్ మసాలా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలే అక్కడ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. రజనీకాంత్ నటించిన పెద్దన్న తెలుగులో ఫ్లాప్ అయినా తమిళంలో మాత్రం హిట్ అయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు ప్రేక్షకులు తిరస్కరించిన సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు పట్టం కట్టారు. తమిళంలో ఈ రొటీన్ మాస్ మసాలా సినిమాలకు క్రిటిక్స్ నుంచి ఏకంగా 4 రేటింగ్ వస్తుండటం గమనార్హం. తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు సైతం క్రిటిక్స్ ఆ స్థాయిలో రేటింగ్ ఇవ్వడం లేదు. తమిళ ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికీ మారుతుందో చూడాల్సి ఉంది. రొటీన్ మాస్ మసాలా సినిమాలే అక్కడి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

అయితే ఇతర భాషల ప్రేక్షకులు మాత్రం కోలీవుడ్ మూవీస్ కు సంబంధించి గతంతో పోలిస్తే క్వాలిటీ తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తమిళంలో కొంతమంది దర్శకులు మాత్రం కొత్త తరహా కథలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటూ ఉండటం గమనార్హం.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus