Jamuna: టాలీవుడ్లో విషాదం.. ఒకప్పటి హీరోయిన్ జమున మృతి!

టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ మోస్ట్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన జమున ఈరోజు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆమె ఈరోజు.. హైదరాబాద్ లోని తన నివాసంలో చివరి శ్వాస విడిచారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో ఈమె నటించి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. అన్ని భాషల్లోనూ కలుపుకుని ఈమె 140 సినిమాల్లో నటించారు. 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించారు జమున. ఈమె తండ్రి పేరు నిప్పణి శ్రీనివాసరావు, తల్లి పేరు కౌసల్యాదేవి.

జమున అసలు పేరు జానాబాయి. సినిమాల్లోకి వచ్చాక జ్యోతిష్యుల సలహాల మేరకు జమునగా పేరు మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరులోని… దుగ్గిరాల బాలికల పాఠశాలలో జమున విద్యాభ్యాసం జరిగింది. ఈమె తన తల్లి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. ఈమె మంచి సింగర్ ఉన్నారు. హార్మోనియం వంటివి కూడా బాగా వాయించేవారు. ఒక రోజు ‘ఖిల్జీరాజుపతనం’ అనే నాటకం కోసం సీనియర్ నటులు జగ్గయ్య… జమున గారిని సంప్రదించి ఆమెను ఓ పాత్రకు ఎంపిక చేశారు. అటు తర్వాత ఆమె ‘మా భూమి’ నాటకంలో కూడా ఓ పాత్ర చేశారు.

అది చూసిన డాక్టర్ గరికిపాటి రాజారావు ఆమెకు తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. 1952లో వచ్చిన ‘పుట్టిల్లు’ సినిమాతో జమున సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్‌, భాగ్యరేఖ, గుండమ్మకథ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు జమున. 2008లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు కూడా అందుకున్నారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు లభించాయి. జమున రాజకీయాల్లో కూడా రాణించారు. 1989వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం నుండి లోక్ సభకు ఎంపికయ్యారు జమున.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus