టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొత్తానికి గోపీచంద్ అయితే సీటిమార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. గత నాలుగు సినిమాలతో గోపీచంద్ దారుణమైన రిజల్ట్ ను అందుకున్న విషయం తెలిసిందే. గౌతమ్ నంద, ఆక్సిజన్, పంతం, చాణక్య వంటి సినిమాలతో కాస్త డిఫరెంట్ జానర్ టచ్ చేసిన గోపీచంద్ బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇక ఫైనల్ గా రెండవసారి సంపత్ నంది కాంబినేషన్ లో చేసినటువంటి సీటీమార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
2021 గోపీచంద్ కు కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కేవలం గోపీచంద్ మాత్రమే కాకుండా ఈ ఏడాదిలోనే మరో ముగ్గురు హీరోలు కూడా ఫామ్ లోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా తర్వాత గోపాల గోపాల సినిమాతో పర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు అజ్ఞాతవాసి సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఇక ఈ కరోనా కష్ట కాలంలోనే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మొత్తానికి మంచి విజయాన్ని అందుకుని ఫామ్ లోకి వచ్చాడు.
ఈ తరహా లో గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే అలాగే అల్లరి నరేష్ నాంది సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!