Tollywood: టాలీవుడ్ సినిమాలతో నెట్ ఫ్లిక్స్ రేంజ్ పెరుగుతోందా?

ప్రముఖ ఓటీటీలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మధ్య గట్టి పోటీ ఉందనే సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వరకు అమెజాన్ ప్రైమ్ మాత్రమే తెలుగు సినిమా డిజిటల్ హక్కులను ఎక్కువగా కొనుగోలు చేయగా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కు నెట్ ఫ్లిక్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయితే నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సినిమాలకు మాత్రం రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

టాలీవుడ్ సినిమాలతో నెట్ ఫ్లిక్స్ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం. నాని నటించి గత నెలలో విడుదలైన అంటే సుందరానికి సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అంటే సుందరానికి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ లో కళ్లు చెదిరే స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అతి త్వరలో ఈ ఓటీటీలో ఎఫ్3 మూవీ కూడా స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన విరాటపర్వం నెట్ ఫ్లిక్స్ లో మాత్రం కళ్లు చెదిరే స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కేజీఎఫ్2, సర్కారు వారి పాట సినిమాలను అమెజాన్ ప్రైమ్ మొదట రెంట్ విధానంలో విడుదల చేయడంతో ఈ సినిమాలకు కూడా ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు.

నెట్ ఫ్లిక్స్ మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ఎంచుకుంటూ వ్యూస్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీ వల్ల నెట్ ఫ్లిక్స్ కు ఊహించని స్థాయిలో మేలు జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ ను కొనుగోలు చేయడం కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ప్లస్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ మూవీ పేరు మారుమ్రోగుతుండటంతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus