కరోనా ఫస్ట్ వేవ్ వల్ల ఈ ఏడాది సంక్రాంతికి క్రాక్ మినహా మరే పెద సినిమా రిలీజ్ కాలేదు. సాధారణ పరిస్థితులు ఏర్పడి ఉప్పెన, జాతిరత్నాలు సినిమలు సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించగా వకీల్ సాబ్ రిలీజైన సమయంలో కరోనా కేసులు పెరిగి థియేటర్లు మూతబడ్డాయి. వకీల్ సాబ్ కు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడానికి ఒక విధంగా కరోనా సెకండ్ వేవ్ కూడా కారణమని చెప్పవచ్చు.
అయితే వేర్వేరు కారణాల వల్ల టాలీవుడ్ స్టార్ హీరోలంతా సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రాధేశ్యామ్, సర్కారు వారి పాట, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలలో ఏ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ మూడు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు సరిపోవనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు ఎఫ్3, బంగార్రాజు సంక్రాంతి రేస్ లో నిలిస్తే ఆ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
సోగ్గాడే చిన్నినాయన, ఎఫ్2 సినిమాలు సంక్రాంతికి రిలీజై సక్సెస్ సాధించినా అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. అయితే మహేష్, పవన్, ప్రభాస్ వేర్వేరు కారణాల వల్ల రిలీజ్ డేట్లను మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2022 సంక్రాంతి రేసులో ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను మార్చుకుని సంక్రాంతికి రిలీజైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!