తెలుగు చిత్రాల విజయాన్ని గతంలో రోజులతో లెక్కపెట్టేవారు. ఇప్పుడు సినిమా వసూలు చేసిన కలక్షన్లను బట్టి డిసైడ్ చేస్తున్నారు. అందుకే చిత్రాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ ని బద్ధలుకొడుతున్నారు. ఈ రేసులో ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్లు కీలకమవుతున్నాయి. తొలి రోజు ఎక్కువగా కాసులు కురిపించిన చిత్రమే నిర్మాతలకు లాభాన్ని ఇస్తున్నాయి. అలా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ టెన్ తెలుగు చిత్రాలపై ఫోకస్ ..
1. బాహుబలి బిగినింగ్దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్ 2015లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ నటించిన ఈ చిత్రం తొలి రోజు 75 కోట్లను వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. మొదటివారానికి 225 కోట్లను కొల్లగొట్టి తిరుగులేదని అనిపించుకుంది. ఈ సినిమా మొత్తం మీద 602 కోట్లు రాబట్టి టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది.
2. సర్దార్ గబ్బర్ సింగ్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ గా ఆకట్టుకోకపోయినా.. ఆ సినిమా మాత్రం మొదటి రోజు 40 కోట్లు వసూల్ చేసి పవన్ పై అభిమానుల్లో ఉన్న క్రేజ్ ని చూపించింది. ఇక మూవీ మొదటి వారానికి 73 రాబట్టింది.
3. శ్రీమంతుడుసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు తొలి రోజు 30 కోట్లను రాబట్టింది. మొదటివారం పూర్తి అయ్యేసరికి ఈ మూవీ 101 కోట్లను వసూల్ చేసి ప్రిన్స్ సత్తాను చాటింది. మొత్తం మీద 144 కోట్లతో మహేష్ శ్రీమంతుడు అనిపించుకున్నాడు.
4. నాన్నకు ప్రేమతోయంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాస్ నటించిన “నాన్నకు ప్రేమతో” సినిమా క్లాస్ ప్రజలను ఆకట్టుకొని మొదటి రోజు 24 కోట్లను తన అకౌంట్లో వేసుకుంది. తొలి వారానికి 43 కోట్లను వసూల్ చేసింది.
5. జనతా గ్యారేజ్ఈ ఏడాది విడుదలైన వాటిలో కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది జనతా గ్యారేజ్. తారక్ నటించిన ఈ సినిమా తొలి రోజు 20.5 కోట్లు వసూల్ చేయగా, మొదటి వారానికి వంద కోట్ల క్లబ్ లో చేరింది.
6. సరైనోడుస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “సరైనోడు” చిత్రం ద్వారా తన పరిధిని విస్తరించాడు. ఈ చిత్రం మొదటి రోజు 14.4 కోట్లు కలక్షన్స్ పట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి వారానికి “సరైనోడు” ప్రపంచవ్యాప్తంగా 70 రాబట్టాడు. మొత్తానికి బన్నీ 127 కోట్లు కొల్లగొట్టి మెగా పవర్ చూపించాడు.
7. అత్తారింటికి దారేదిఅత్తారింటికి దారేది చిత్రం విడుదలై మూడేళ్లు అవుతున్నా, ఆ సినిమా నమోదు చేసిన రికార్డులు పవన్ కళ్యాణ్ రేంజ్ ని గుర్తుచేస్తున్నాయి. ఈ మూవీ తొలి రోజు 10 కోట్లు వసూల్ చేసింది. తొలి వారానికి 47 కోట్లను రాబట్టింది.
8. బ్రూస్ లీమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన బ్రూస్ లీ తొలి రోజు 10 కోట్లు వసూల్ చేయగా, మొదటి వారానికి 53 కోట్లను రాబట్టింది. ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వారంలోనే 50 కోట్ల క్లబ్ లో బ్రూస్లీ చేరడం విశేషం.
9. ధృవడైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా గత శుక్రవారం విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్. వి. ప్రసాద్ లు సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రం మిడ్ నైట్, బెనిఫిట్ షోలు లేనప్పటికీ తొలి రోజు 9.8 కోట్లు వసూల్ చేసి మెగా పవర్ చూపించింది.
10. ఎవడుకొత్త కథ, కథనంతో ఎవడు మెగా ఫ్యాన్స్ ని అలరించింది. రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టిన ఈ మూవీ ఫస్ట్ డే 8.65 కోట్లు, ఫస్ట్ వీక్ 36 కోట్లు వసూల్ చేసింది.
11. గోవిందుడు అందరివాడేలేచెర్రీ నటించే చిత్రాలు మినిమమ్ గ్యారంటీ అని అతని చిత్రాల రికార్డులను పరిశీలిస్తే అర్ధమవుతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా తొలి రోజు 8.55 కోట్లు, తొలి వారం 27.5 కోట్లు రాబట్టింది.